NHAI Recruitment: డిగ్రీ అర్హతతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
NHAI Recruitment: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌హెచ్ఏఐ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్..
NHAI Recruitment: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌హెచ్ఏఐ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ కోసం ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
* ట్రాఫిక్ అండ్ టోల్ రెవెన్యూ, ఫైనాన్స్, ఎఫ్ అండ్ ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* జనరల్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 15 ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
* డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. కనీసం 10 ఏళ్లు అనుభవం ఉండాలి.
* ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను hr.nhiimpl@nhai.org మెయిల్ ఐడీకి పంపించాలి.
* దరఖాస్తుల స్వీకరణకు 31-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Makar Sankranti 2022: భోగి పండుగ రోజు ఈ స్వీట్ తినండి.. ఎలా చేయాలో తెలుసుకోండి..
Indian Army New Uniform: హై టెక్నాలజీతో ఇండియన్ ఆర్మీ యూనిఫామ్.. ఎలా తయారు చేశారో తెలుసా..