UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..
UPSC Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని...
UPSC Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 78 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ ఎడిటర్–01, అసిస్టెంట్ డైరెక్టర్ (కాస్ట్)–16, ఎకనమిక్ ఆఫీసర్–04, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–01, మెకానికల్ మెరైన్ ఇంజనీర్–01, లెక్చరర్(ఆక్యుపేషనల్ థెరపీ)–04, సైంటిస్ట్(బి)–02, కెమిస్ట్–05, జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్–36, రీసెర్చ్ ఆఫీసర్–01, అసిస్టెంట్ ప్రొఫెసర్–01 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఏదైనా డిగ్రీ సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, సీఏ, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 27-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: నీ స్పీడు ముందు యంత్రాలు కూడా బలాదూర్ బ్రదర్ !! వీడియో
Bollywood Stars: బ్రేకప్ రూమర్స్.. ఒక్క ఫోటోతో అదిరిపోయే రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..
AP: ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఏపీ సర్కార్ కొరడా.. నిబంధనలు ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్..