BSNL Recruitment: ఎల్ఎల్‌బీ చేసిన వారికి బీఎస్ఎన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.75 వేలు జీతం..
BSNL Recruitment 2022: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంన్థ కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు...
BSNL Recruitment 2022: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంన్థ కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా 02 ఫుల్‌టైమ్ యంగ్ లీగల్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ (ఎల్ఎల్‌బీ) ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* వీటితో పాటు సంబంధిత పని అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 09-02-2022 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ/ఇంటరేక్షన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
* రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 75000 జీతంగా అందిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 09-02-2022 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
IND vs SA: వన్డే జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు చోటు.. 6 నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడనున్న భారత్..!
IND vs PAK: ఇకనుంచి ప్రతి ఏటా భారత్-పాకిస్తాన్ మ్యాచులు.. ఐసీసీ ముందు పీసీబీ సరికొత్త ప్రతిపాదన..!