IND vs SA: వన్డే జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు చోటు.. 6 నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడనున్న భారత్..!

కరోనా పాజిటివ్‌ కారణంగా వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. సుందర్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

IND vs SA: వన్డే జట్టులో ఇద్దరు  ఆటగాళ్లకు చోటు.. 6 నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడనున్న భారత్..!
Ind Vs Sa
Follow us

|

Updated on: Jan 12, 2022 | 8:34 PM

India ODI Squad For South Africa: కరోనా పాజిటివ్‌ కారణంగా వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. సుందర్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ట్వీట్ చేసింది. బెంగళూరులో జరిగిన శిక్షణ శిబిరంలో సుందర్‌కు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన సంగతి విదితమే. సుందర్‌ బుధవారం మిగతా వన్డే జట్టుతో పాటు కేప్‌టౌన్‌కు వెళ్లాల్సి ఉంది. సుందర్‌ తొలి మ్యాచ్‌ నుంచి ఔట్‌ కావచ్చని గతంలో వార్తలు వస్తుండగా, ప్రస్తుతం అతను మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. కేఎల్ రాహుల్(KL Rahul) సారథ్యంలో వన్డే సిరీస్‌ను భారత్ ఆడనుంది. వన్డే సిరీస్‌ జనవరి 19 నుంచి మొదలుకానుంది.

సైనీ కూడా వన్డే జట్టులో.. ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ‘స్యామ్ స్ట్రింగ్’ స్ట్రెయిన్ కారణంగా గాయపడిన మహ్మద్ సిరాజ్‌కు బ్యాకప్‌గా యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కూడా వన్డే జట్టులో చేరాడు. సైనీ ఇప్పటి వరకు ఆడిన 8 వన్డేల్లో 6 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, జయంత్ 2016 సంవత్సరంలో భారత్ తరఫున ఏకైక వన్డే మ్యాచ్‌ను ఆడి వికెట్ తీయడంలో విజయం సాధించాడు.

రాహుల్ కెప్టెన్సీలో.. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడంతో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి వన్డే జనవరి 19న జరగనుంది. రెండో వన్డే జనవరి 21న, మూడో వన్డే జనవరి 23న జరగనుంది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ జరగనుంది.

దాదాపు 6 నెలల తర్వాత భారత జట్టు వన్డే ఆడనుంది. 2021లో టీమ్ ఇండియా కేవలం 6 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ఈ ఫార్మాట్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను జులై 23న శ్రీలంకతో ఆడింది. ఆ సిరీస్ సమయంలో, భారత ప్రధాన జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. దాంతో టీమిండియా B టీంను శ్రీలంక పంపించారు.

Also Read: ‎IND vs PAK: ఇకనుంచి ప్రతి ఏటా భారత్-పాకిస్తాన్ మ్యాచులు.. ఐసీసీ ముందు పీసీబీ సరికొత్త ప్రతిపాదన..!

తొలి ఓవర్లో ఊచకోత.. కట్ చేస్తే సీన్ రివర్స్.. 17 పరుగులిచ్చి 6 వికెట్లతో సత్తా చాటిన మాజీ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..