తొలి ఓవర్లో ఊచకోత.. కట్ చేస్తే సీన్ రివర్స్.. 17 పరుగులిచ్చి 6 వికెట్లతో సత్తా చాటిన మాజీ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్

అతడు బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. బ్యాటర్లకు దడ పుట్టాల్సిందే. అతడే స్పెషలిస్ట్ స్పిన్నర్..

తొలి ఓవర్లో ఊచకోత.. కట్ చేస్తే సీన్ రివర్స్.. 17 పరుగులిచ్చి 6 వికెట్లతో సత్తా చాటిన మాజీ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్
Rashid Khan
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 12, 2022 | 6:12 PM

అతడు బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. బ్యాటర్లకు దడ పుట్టాల్సిందే. అతడే స్పెషలిస్ట్ స్పిన్నర్.. టీ20ల్లో కింగ్ ఖాన్.. ఎవరో ఈపాటి మీకు అర్ధమై ఉంటుంది. అతడెవరో కాదు ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ ప్రొఫెషినల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి అటు బౌలర్‌గా.. ఇటు బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న క్రికెట్ లీగ్‌ల అన్నింటిలోనూ సత్తా చాటాడు.

ఇదిలా ఉంటే ఇటీవల జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్ 2021-22లో రషీద్ ఖాన్ మరోసారి తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో జరిగిన 46వ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 6 వికెట్లతో అదరగొట్టాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున బరిలోకి దిగిన రషీద్ బ్రిస్బేన్ హీట్‌పై విధ్వంసం సృష్టించాడు.. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీనితో బ్రిస్బేన్ హీట్ 71 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ బిగ్ బాష్ సీజన్‌లో రషీద్‌కి ఇదే చివరి మ్యాచ్.

రషీద్ 4 ఓవర్ల స్పెల్ ఇలా సాగింది..

మొదటి ఓవర్‌లో తొలి బంతికే ఫోర్ సమర్పించిన రషీద్.. ఆ ఓవర్ ముగిసేసరికి మొత్తం 11 పరుగులు ఇచ్చాడు. అయితే తర్వాతి 3 ఓవర్లలో రషీద్ ఖాన్ కేవలం 6 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టడంతో బ్రిస్బేన్ హీట్ కేవలం 90 పరుగులకే కుప్పకూలింది. కాగా, ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత టార్గెట్ చేధనలో భాగంగా బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ రషీద్ ఖాన్ దెబ్బకు 90 పరుగులకే చాప చుట్టేసింది. ఆ జట్టులో డకట్(24) ఒక్కడే టాప్ స్కోరర్.

Also Read:

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!

మద్యం షాప్ దగ్గర ఆగి ఉన్న ఇన్నోవా కారు.. అనుమానంతో డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో