UPSC Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
UPSC Recruitment 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో...

UPSC Recruitment 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ భాగాల్లో మొత్తం 64 ఖాళీలు ఉన్నాయి. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలిలాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 64 ఖాళీలకు గాను అసిస్టెంట్ ప్రొఫెసర్ (01), అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ (06), సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (16), అసిస్టెంట్ డైరెక్టర్ (33), మెడికల్ ఆఫీసర్ (08) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 11 – 11 – 2021 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Huzurabad By Election: మూగబోయిన మైకులు.. సైలెంటైన నేతలు.. ఇక మిగిలింది..
Pushpa: పుష్ప నుంచి మూడో సాంగ్.. గురువారం ఉదయం ‘సామీ సామీ’ పాట విడుదల..