IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు.. 1968 ఖాళీలు..
IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) రిఫైనరీస్ విభాగంలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా..
IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) రిఫైనరీస్ విభాగంలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా రిఫైనరీస్ విభాగంలో ఉన్న ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను తీసుకోనున్నారు. ఏయో ట్రేడుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు, విద్యార్హతలు ఏంటన్న వాటిపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1968 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంటెంట్, డీఈఓ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 31-10 -2021 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* నోటిఫికేషన్‌లో భాగంగా గువహటి, బరౌనీ, గుజరాత్, హల్డియా, మథురా, పానిపట్, డిగ్బాయ్ రిఫైనరీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* అభ్యర్థులను రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 12 -11 – 2021 నుంచి ప్రారంభం కానున్నాయి.
* చివరి తేదీగా 21 – 11 – 2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: బీపీని నియంత్రించేందుకు ఈ ఆహార పదార్థాలు తీసుకోండి
Big News Big Debate: బద్వేలు ప్రీమియర్ లీగ్ – BPL వార్‌లో పేలుతోన్న మాటల తూటాలు
Kid Safety: బైక్‌పై పిల్లలను తీసుకెళ్తున్నారా.. నియమాలు తెలియకపోతే బుక్కైనట్లే..