AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: పుష్ప నుంచి మూడో సాంగ్.. గురువారం ఉదయం ‘సామీ సామీ’ పాట విడుదల..

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న లేటేస్ట్ చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్స్ అందించిన తర్వాత బన్నీ, సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు భారీగానే ఉన్నాయి...

Pushpa: పుష్ప నుంచి మూడో సాంగ్.. గురువారం ఉదయం 'సామీ సామీ' పాట విడుదల..
Saami
Srinivas Chekkilla
|

Updated on: Oct 27, 2021 | 8:22 PM

Share

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న లేటేస్ట్ చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్స్ అందించిన తర్వాత బన్నీ, సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా.. మొదటి సారి పూర్తి స్థాయి ఢీ గ్లామర్ లుక్‏లో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించబోతున్నాడు బన్నీ. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ని ”పుష్ప: ది రైజ్” పేరుతో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ప్రమోషన్స్‎లో భాగంగా ‘సామీ సామీ’ అనే సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ రేపు విడుదల చేయనున్నారు. ఈ పాటను గురువారం ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని – వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ”పుష్ప” సినిమాని తీస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. పుష్పకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ పాట ప్రోమోని విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి దాక్కొదాక్కొ మేక, శ్రీవల్లి పాటలు వచ్చాయి. దాక్కొదాక్కొ పాట యూట్యూబ్‎లో ఇప్పటికే 10 మిలియన్లకు పైగా చూశారు.

Read Also.. Pooja Hegde: విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తోన్న పూజా హెగ్డే.. ఎక్కడో తెలుసా..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే