Varudu Kaavalenu Event Live: వరుడు కావలెను ప్రీ రిలీజ్.. ముఖ్యఅతిథిగా బన్నీ..

Varudu Kaavalenu: యంగ్ హీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా వరుడు కావలెను. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య ఈ సినిమాను తెరకెక్కింది. ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతువర్మ హీరోయిన్ గా నటించింది...

Varudu Kaavalenu Event Live: వరుడు కావలెను ప్రీ రిలీజ్.. ముఖ్యఅతిథిగా బన్నీ..
varudu kaavalenu
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 27, 2021 | 7:45 PM

Varudu Kaavalenu: యంగ్ హీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా వరుడు కావలెను. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య ఈ సినిమాను తెరకెక్కింది. ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతువర్మ హీరోయిన్ గా నటించింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్రాన్ని అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రానా విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబందించిన సంగీత్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బుట్టబొమ్మ పూజ హెగ్డే ముఖ్య అతిథిగా హాజరు అయ్యింది. ఈ సినిమా విజయంపై చిత్రయూనిట్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ – థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఇవాళ జరుగుతోంది. ప్రీ రిలీజ్‎కు అల్లు అర్జున్‌ను ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Read Also.. Romantic: “రొమాంటిక్” హీరోయిన్ కేతిక శర్మ చెప్పిన ఆసక్తికర విషయాలు.. మీ కోసం..