Romantic: “రొమాంటిక్” హీరోయిన్ కేతిక శర్మ చెప్పిన ఆసక్తికర విషయాలు.. మీ కోసం..

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి, అందాల భామ కేతిక శర్మ జంటగా నటించిన ‘రొమాంటిక్’ మూవీ అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గురించి అందాల నటి కేతిక శర్మ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు...

Romantic: రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ చెప్పిన ఆసక్తికర విషయాలు.. మీ కోసం..
Kethika Sharma

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి, అందాల భామ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ పాదురి దర్శకుడిగా వ్యవహస్తున్నారు. ఈ సినిమా గురించి అందాల నటి కేతిక శర్మ ఎన్నో విషయాలు చెప్పారు. తనకు అవకాశం ఎలా వచ్చింది. ఆకాష్‎తో నటించడం ఎలా ఉందో ఆమె మాటల్లోనే..

నేను ఢిల్లీ నుంచి వ‌చ్చాను. మాది డాక్టర్స్ ఫ్యామిలీ.. అయితే నేను మాత్రం ఒక‌ కొత్త ప్రపంచాన్ని ఎంచుకున్నాను. నాకు ఈ రంగమంటే చాలా ఇష్టం. సినిమా ఫీల్డ్‎కు రావాలని అనుకున్నాను. ఇలా డెబ్యూ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్‎స్టాగ్రాంలో మిమ్మల్ని చూశాం.. మీరు ఒకసారి ఆడిషన్‌కి రండి అని పూరి కనెక్ట్స్ నుంచి కాల్ వచ్చింది. వచ్చాను.. ఆడిషన్ ఇచ్చాను.. అలా సినిమా మొదలైంది.

ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయి కారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను. ‘మౌనిక ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది’ అనే డైలాగ్ చాలా బాగుంటుంది. నా మొదటి చిత్రమే పూరి క‌నెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉంది. పూరి సార్ లెజెండరీ డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దర్శకుడిగానే కాకుండా ఆయన మనస్తత్వం ఇంకా చాలా ఇష్టం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. వారితో కలిసి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.

నా మొదటి చిత్రంలోనే నాకు పాట పాడే అవకాశం వచ్చింది. నా వల్లే కాదే పాటను పాడాను. చాలా ఆనందంగా ఉంది. నా సినిమా రెండు రోజుల్లో విడుదల కాబోతోందనే సంతోషంగా నాలో ఎక్కువైంది. తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరుతోంది. ఈ చిత్రంలో క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఎంతో ఇంటెన్సిటీతో ఉంటుంది. రమ్యకృష్ణ , ఆకాష్‌తో కలిసి నటించడం ఛాలెంజింగ్‎గా అనిపించింది. దర్శకుడు అనిల్ పాదురిని సీన్ గురించి పదే పదే అడిగేదాన్ని. టోట‌ల్ ఔట్‌పుట్ చూశాక ఆడియెన్స్‌కు నేను నచ్చుతాను అని అనిపించింది.

ఆకాష్ చాలా మంచి వ్యక్తి. నేను కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూసుకున్నాడు. నాకు ఈ చిత్రంలో ఆకాష్ రూపంలో ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు. సినిమా అందరికీ నచ్చుతుంది. సూపర్ హిట్ అవుతుందని నాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఫుల్ మాస్ థియేటర్ మూవీ. పక్కా పూరిగారి సినిమాలా ఉంటుంది. పూరి గారు ఓ అమ్మాయిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారంటే.. కచ్చితంగా ఏదో టాలెంట్ ఉందని అంతా అనుకుంటారు. అందుకే నాకు ఈ సినిమా విడుదల కాకముందే అవకాశాలు వచ్చాయి. అదంతా పూరి గారి వల్లే. నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాను చేస్తున్నాను.

బయోపిక్స్‌లో నటించాలని ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతో సహజంగా నటిస్తుంది. లవ్ స్టోరీ సినిమాను చూశాను. ఆమె చాలా చక్కగా నటించింది. ఆమె డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసే ప్రతీ ఒక్కటీ నాకు ఇష్టమే. రమ్యకృష్ణ న‌ట‌న‌ అద్భుతం. ఆమె ఈ చిత్రంలోకి రావడంతో అంతా మారిపోయింది. ప్రతీ ఒక్కరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది.

ప్రభాస్ గారు మా టీంను పిలిచారు. డార్లింగ్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతోన్నారు అంటే నేను అస్సలు నమ్మలేదు. మా ఇంట్లో వాళ్లు, నార్త్ సైడ్ అంతా ఎక్కువగా సౌత్ సినిమాలు చూడరు. కానీ బాహుబలి మాత్రం అందరికీ తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇండస్ట్రీ అంటే బాహుబలితోనే గుర్తిస్తున్నారు. అలాంటి ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయాను. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. చాలా మంచి వారు. ఎంతో సింఫుల్‌గా ఉంటారు. ఆయన మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మా సినిమాను ప్రమోట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

సినిమా మొదటి నుంచి చివరి వరకు ఛార్మీ మా వెంటే ఉన్నారు. ఆమే నాకు శిక్షణ ఇచ్చారు. మౌనికను నాలో ఆమె చూశారు. నన్ను నమ్మారు. ఆమె ఎంతో మంచి వ్యక్తి. రొమాంటిక్ చిత్రంలో కరోనా కంటే ముందే షూట్ చేశాం. లక్ష్య సినిమా కరోనా సమయంలోనే షూట్ చేశాం. నా రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రావడం సంతోషంగా ఉంది. రొమాంటిక్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మీరంతా కూడా రొమాంటిక్ చిత్రాన్ని ఎంతో ఇష్టపడతారు. అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి. ప్రతీ సీన్ ట్రీట్‌లా ఉంటుంది. డబ్బింగ్ చెప్పలేదు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలోనే డబ్బింగ్ చెప్పాలని ఉంది.

Read Also.. Rajinikanth Annaatthe Trailer: సూపర్ స్టార్ రజినీకాంత్ “అన్నతే”.. అదిరిపోయిన ట్రైలర్..

Click on your DTH Provider to Add TV9 Telugu