Ketika Sharma: మొదటి సినిమాతోనే ‘రొమాంటిక్’ హీరోయిన్‌గా ‘కేతిక శర్మ’ అందాలు..(ఫొటోస్)
Anil kumar poka |
Updated on: Oct 30, 2021 | 5:36 PM
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి, అందాల భామ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’.. ఈ సినిమా గురించి అందాల నటి కేతిక శర్మ ఎన్నో విషయాలు చెప్పారు. తనకు అవకాశం ఎలా వచ్చింది. ఆకాష్‌తో నటించడం ఎలా ఉందో ఆమె మాటల్లోనే..
Oct 30, 2021 | 5:36 PM
డాక్టర్స్ ఫ్యామిలీ నుండి యాక్టింగ్ సైడ్ వచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ
1 / 10
కేతిక శర్మ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం రొమాంటిక్..
2 / 10
ఈ సినిమా గురించి అందాల నటి కేతిక శర్మ ఎన్నో విషయాలు చెప్పారు. తనకు అవకాశం ఎలా వచ్చింది. ఆకాష్‌తో నటించడం ఎలా ఉందో ఆమె మాటల్లోనే..
3 / 10
నాకు ఈ రంగమంటే చాలా ఇష్టం. సినిమా ఫీల్డ్‌కు రావాలని అనుకున్నాను. ఇలా డెబ్యూ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్‌స్టాగ్రాంలో మిమ్మల్ని చూశాం.. మీరు ఒకసారి ఆడిషన్‌కి రండి అని పూరి కనెక్ట్స్ నుంచి కాల్ వచ్చింది. వచ్చాను.. ఆడిషన్ ఇచ్చాను.. అలా సినిమా మొదలైంది.
4 / 10
పూరి జగన్నాథ్ రచయితగా వ్యవహరించిన ఈ సినిమాకు అనిల్ పాడురీ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 29న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
5 / 10
ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయి కారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను.
6 / 10
నా మొదటి చిత్రమే పూరి కనెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉంది. పూరి సార్ లెజెండరీ డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దర్శకుడిగానే కాకుండా ఆయన మనస్తత్వం ఇంకా చాలా ఇష్టం.
7 / 10
ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. వారితో కలిసి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.ఆకాష్ చాలా మంచి వ్యక్తి. నేను కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూసుకున్నాడు. నాకు ఈ చిత్రంలో ఆకాష్ రూపంలో ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు. సినిమా అందరికీ నచ్చుతుంది. సూపర్ హిట్ అవుతుందని నాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది.
8 / 10
అందుకే నాకు ఈ సినిమా విడుదల కాకముందే అవకాశాలు వచ్చాయి. అదంతా పూరి గారి వల్లే. నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాను చేస్తున్నాను.
9 / 10
రొమాంటిక్ చిత్రంలో కరోనా కంటే ముందే షూట్ చేశాం. లక్ష్య సినిమా కరోనా సమయంలోనే షూట్ చేశాం. నా రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రావడం సంతోషంగా ఉంది. రొమాంటిక్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.