THSTI Recruitment: ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ..
THSTI Recruitment: భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్(టీహెచ్‌ఎస్‌టీఐ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఫరీదాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో...
THSTI Recruitment: భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్(టీహెచ్‌ఎస్‌టీఐ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఫరీదాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ రేపటితో (11-07-2021) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 12 ఖాళీల్లో భాగంగా.. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ (01), కంప్యూటర్ ప్రోగ్రామర్ (01), డేటాఎంట్రీ ఆపరేటర్ (04), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)- (06) పోస్టులను భర్తీ చేయనున్నారు. * ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు సైన్స్/సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. అభ్యర్థుల వయసు 30ఏళ్లు మించకూడదు. * కంప్యూటర్ ప్రోగ్రామర్ పోస్టుకు అప్లై చేసుకునే వారు కంప్యూటర్ అప్లికేషన్/ఐటీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. * డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్ /సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. * మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) పోస్టులకు అప్లై చేసుకునే వారు హైస్కూల్/తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను తొలుత అకాడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం సెలక్షన్ బోర్డ్ నిర్ణయం మేరకు తదుపరి ఎంపిక చేస్తారు. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ రేపటితో (12-07-2021) ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Also Read: Google pay: గూగుల్ పే ద్వారా రోజుకు ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చో తెలుసా…
Leopard : తిరుమలలో కలకలం పుట్టిస్తోన్న చిరుతపులులు.. నేడు మళ్లీ ఘాట్ రోడ్‌లో పులి ప్రత్యక్షం