THDC Recruitment 2022: పదో తరగతి అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో 100 పోస్టులు.. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగానే..

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోనున్న టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీహెచ్‌డీసీ) ఇండియా లిమిటెడ్‌.. 100 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తూ నోటిఫికేషన్‌ విడుదల..

THDC Recruitment 2022: పదో తరగతి అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో 100 పోస్టులు.. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగానే..
THDC India Limited
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 27, 2022 | 5:31 PM

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోనున్న టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీహెచ్‌డీసీ) ఇండియా లిమిటెడ్‌.. 100 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డ్రాఫ్ట్‌మెన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు బోర్డు నుంచి పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్‌ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి ఏడాదిపాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో నిబంధనల మేరకు స్టైపెండ్‌ కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టులు: 30
  • స్టెనోగ్రాఫర్/సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులు: 30
  • డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) పోస్టులు: 15
  • ఫిట్టర్ పోస్టులు: 5
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 15
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పోస్టులు: 5

అడ్రస్:

Sr. Manager (HR) THDC India Limited Bhagirathi Bhawan Pragatipuram, By- Pass Road Rishikesh-249201 .

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.