SSC Constable GD 2022: చివరి అవకాశం! కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్ పోస్టులకు 3 రోజుల్లో ముగుస్తున్న గడువు..

న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్న 24,369 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో మూడు రోజుల్లో (నవంబర్ 30) ముగియనుంది. కేంద్ర..

SSC Constable GD 2022: చివరి అవకాశం! కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్ పోస్టులకు 3 రోజుల్లో ముగుస్తున్న గడువు..
SSC Constable GD 2022
Follow us

|

Updated on: Nov 27, 2022 | 6:01 PM

న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్న 24,369 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో మూడు రోజుల్లో (నవంబర్ 30) ముగియనుంది. కేంద్ర బలగాల్లో చేరాలనుకునే వారికి ఇదే చివరి అవకాశం. ఈ నోటిఫికేషన్‌ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)లలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులు, అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)లోని సిపాయి పోస్టులను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయస్తారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన పురుష/మహిళా అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లకు, మహిళా అభ్యర్థులకు 157 సెంటీమీటర్లకు తగ్గకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్ధులు రూ.100 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష, శారీరక దారుడ్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు. 2023 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.69,100 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు ఇవే..

  • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) పోస్టులు: 10,497
  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌) పోస్టులు: 100
  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌) పోస్టులు: 8911
  • సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ) పోస్టులు: 1284
  • ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) పోస్టులు: 1613
  • అస్సాం రైఫిల్స్(ఏఆర్‌) పోస్టులు: 1697
  • సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌) పోస్టులు: 103
  • నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) పోస్టులు: 164

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.