AFCAT 2023: అవివాహితులైన నిరుద్యోగులకు బంపరాఫర్! ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

భారత వైమానిక దళంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి అద్భుత అవకాశం. వాయుసేనలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్-01/2023 నోటిఫికేషన్‌ విడుదల..

AFCAT 2023: అవివాహితులైన నిరుద్యోగులకు బంపరాఫర్! ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
AFCAT 2023 Notification
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 27, 2022 | 4:20 PM

భారత వైమానిక దళంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి అద్భుత అవకాశం. వాయుసేనలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్-01/2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు అవివాహితులైన పురుషులతోపాటు, మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ, మెటియోరాలజీ ఎంట్రీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్‌, నాన్-టెక్నికల్) బ్రాంచుల్లో కలిపి మొత్తం 258 కమీషన్డ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ఫయింగ్‌లో 10 (పురుషులకు 5, మహిళలకు 5), గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)లో 130, గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్)లో 118 పోస్టులు ఉన్నాయి. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, వెపన్‌ సిస్టమ్‌, అడ్మినిస్ట్రేషన్‌, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్‌, ఎడ్యుకేషన్‌, మెటియోరాల‌జీ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ కింది అర్హతలుండాలి.

  • ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ పోస్టులకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో చదివి ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ పూర్తి చేసినవారు అర్హులు. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే క‌నీస ఎత్తు 162.5 సెంటీ మీటర్లు ఉండాలి.
  • గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్ పోస్టుల‌కు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో చదివి ఉండాలి. ఎల‌క్ట్రానిక్స్‌/మెకానిక‌ల్ విభాగాల్లో ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన బ్రాంచ్‌లలో బీటెక్‌/బీఈ పూర్తి చేసి ఉండాలి. పురుషుల ఎత్తు 157.5 సెంటీ మీటర్లు, మ‌హిళ‌ల ఎత్తు 152.5 సెంటీ మీటర్లు ఉండాలి.
  • గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నిక‌ల్‌ పోస్టులకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల్లో చదివి ఉండాలి. బీఈ/ బీటెక్‌ లేదా బీకాం/బీఎస్సీ/బీబీఏ/సీఏ/సీఎంఏ/సీఎస్‌/సీఎఫ్‌ఏ, పీజీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. పురుషుల ఎత్తు 157.5 సెంటీ మీటర్లు, మ‌హిళ‌ల ఎత్తు 152.5 సెంటీ మీటర్లు ఉండాలి.
  • ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగంలో దరఖాస్తు చేసుకునేవారు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలి.

ఫ్లయింగ్‌ బ్రాంచి పోస్టులకు వయోపరిమితి జనవరి 1, 2024 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్‌/నాన్ టెక్నిక‌ల్ బ్రాంచ్‌లలోని పోస్టులకు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ట్రైనింగ్‌ 2024 జనవరి నెల మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఫ్లైయింగ్ ఆఫీసర్‌ పోస్టులకు నెలకు రూ.56,000ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.