TS Social Welfare Residential: తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు
TS Social Welfare Residential: తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్. కళాశాలల్లో చేరేందుకు..
TS Social Welfare Residential: తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్. కళాశాలల్లో చేరేందుకు విధించిన గడువును సైతం పొడిగిస్తున్నాయి కాలేజీలు. అలాగే రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో చేరేందుకు కూడా గడువు పొడిగిస్తున్నారు అధికారులు. ఇక తెలంగాణ (Telangana)లో సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీ (Junior Colleges)ల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. టీఎస్‌డబ్ల్యూ ఆర్జేసీ, సీవోఈ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈననెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లోనే నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అర్హులైన అభ్యర్థులు www.tswreis.ac.in ; www.tsswreisjc.cgg.gov.in అనే వెబ్ సైట్లలో దరఖాస్తు చేసుకవాలని అధికారులు తెలిపారు.
ఇంటిగ్రేటేడ్ బీఈడీ కోర్సులలో ప్రవేశాలు..
ఇక నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ-బీఈడీ, బీఏ-బీఈడీ కోర్సులలో ప్రవేశాల కోసం అభ్యర్థులను నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందు కోసం హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలో ఎడ్-సెట్ కన్వీనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10+2 విధానంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులలో ప్రవేశాలకు అర్హులు. వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్ ద్వారా పై కోర్సులలో సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే తొలి దశ కౌన్సెలింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు రెండో లేదా తుది దశ కౌన్సిలింగ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు.
సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్‌లకు అవకాశం 2022 జనవరి 27, 28 తేదీల్లో ఉండగా, ఎంపికైన అభ్యర్థుల జాబితా వెబ్‌సైట్‌లో ప్రచురణ 2022 జనవరి 30తేదీని నిర్ణయించారు. ఇక కాలేజీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపు 2022 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 03 వరకు ఉంది.
ఇవి కూడా చదవండి: