NEET PG 2021: మెడికల్ సీట్ల వివాదంపై సుప్రీం కీలక నిర్ణయం.. వాటిని భర్తీ చేసే ప్రసక్తే లేదంటూ..
NEET PG 2021: నీట్-పీజీ 2021 కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని ధాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రత్యేక కౌన్సెలింగ్ కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది...
NEET PG 2021: నీట్-పీజీ 2021 కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని ధాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రత్యేక కౌన్సెలింగ్ కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వైద్య విద్యలో రాజీ పడే ప్రసక్తే లేదని కోర్టు తేల్చి చెప్పింది. నీట్-పీజీ -21లో మిగిలిపోయిన 1456 సీట్లకు మరో రౌండ్ ప్రత్యేక స్ట్రే కౌన్సెలింగ్ నిర్వాహించాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం రెండు రోజుల పాటు విచారణ జరిపింది.
పీజీ 2021 కోర్సు ప్రారంభమై ఏడాదిన్నర గడుస్తోన్న నేపథ్యంలో, ఇప్పుడు ఈ సీట్లకు మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే.. విద్యార్థుల చదువులు ప్రభావితమవుతాయన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ల ఉపశమనానికి అర్హత లేదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. వైద్య విద్య, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రత్యేక స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించకూడదని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ), కేంద్రం నిర్ణయం తీసుకుందని కోర్టు వివరించింది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..