Special Trains: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అభ్యర్థులకు శుభవార్త.. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

Railway News/ IRCTC: రైల్వే విభాగాల్లోని పలు పోస్టుల కోసం రైల్వే నియామక సంస్థ (RRB) ఎన్టీపీసీ పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో పరీక్ష రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని..

Special Trains: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అభ్యర్థులకు శుభవార్త.. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..
Special TrainsImage Credit source: TV9 Telugu
Follow us

|

Updated on: Jun 06, 2022 | 7:59 PM

Railway News/ IRCTC: రైల్వే విభాగాల్లోని పలు పోస్టుల కోసం రైల్వే నియామక సంస్థ (RRB) ఎన్టీపీసీ పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో పరీక్ష రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేశారు. ఆయా రైళ్లను నడిపే తేదీలతో పాటు బయల్దేరే వేళలు, ఏయే స్టేషన్లలో ఆగుతాయి వంటి వివరాలను ఇందులో పేర్కొన్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. 08615 నంబర్‌ గల రైలు జూన్‌ 10 (శుక్రవారం) న రాత్రి 11.55 గంటలకు హతియా స్టేషన్‌ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరుకుంటుంది. అదేవిధంగా 08616 నంబర్‌ గల రైలు జూన్‌ 13 (సోమవారం) న రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది. బుధవారం ఉదయం 6 గంటలకు హతియా స్టేషన్‌కు చేరుకుంటుంది.

ఈ స్పెషల్‌ ట్రైన్స్‌ రూర్కెలా, జర్సుగూడ, సంబల్‌పూర్‌ సిటీ, అంగుల్‌, కటక్‌, భువనేశ్వర్‌, ఖుర్దా రోడ్‌, బుల్‌గావ్‌, ఛత్రాపూర్‌, బ్రహ్మపూర్‌, పలాస, శ్రీకాకుళం రోడ్‌, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూర్‌ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ-2టైర్‌, ఏసీ-3టైర్‌, స్లీపర్‌క్లాస్‌, జనరల్‌ కోచ్‌లతో పాటు సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Vikram- Amul: విక్రమ్‌ చిత్ర బృందానికి క్రియేటివ్‌గా విషెస్‌ చెప్పిన అమూల్‌.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న కమల్‌ డూడుల్‌..

ICC Awards: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్లను ప్రకటించిన ఐసీసీ.. లిస్టులో ఎవరెవరున్నారంటే..

భారతదేశంలో ప్రారంభమైన Moto E32S విక్రయాలు.. ధరలు, ఫీచర్ల తదితర వివరాలివే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ