AIIMS Recruitment: రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
AIIMS Recruitment: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న క్యాంపస్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు...
AIIMS Recruitment: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న క్యాంపస్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 169 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 169 ఖాళీలకుగాను ప్రొఫెసర్ (37), అడిషనల్ ప్రొఫెసర్ (31), అసోసియేట్ ప్రొఫెసర్ (52), అసిస్టెంట్ ప్రొఫెసర్ (49) పోస్టులు ఉన్నాయి.
* అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ స్పెషలైజేషన్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్) ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధనలో అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,42,506 నుంచి రూ.2,20,000 వరకూ అందిస్తారు.
* అభ్యర్థులను ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు, అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తు హార్డ్‌కాపీలను రిక్రూట్‌మెంట్ సెల్ సెకండ్ ఫ్లోర్, మెడికల్ బిల్డింగ్ గేట్ నెం–5, ఎయిమ్స్ రాయ్‌పూర్, జి.ఇ.రోడ్, తాటిబంద్, రాయ్‌పూర్–4920999(సి.జి.) అడ్రస్‌కు పంపించాలి.
* దరఖాస్తుల స్వీకరణ 25-12-2021న ప్రారంభమవుతుండగా, 10-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
CSA: BCCIతో నిరంతరం టచ్‌లో ఉన్నాం.. దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన ఉంటుంది..
Malladi Vasu: క్షమాపణలు చెప్పిన మల్లాది వాసు.. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడి