SV Medical college Jobs: తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేలకుపైగా జీతం పొందే అవకాశం..
SV Medical college Jobs: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో..
SV Medical college Jobs: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా అప్లై చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఇందులో ఫిజికల్ డైరెక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూం అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్స్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా గ్రాడ్యుయేసన్, మాస్టర్స్ డిగ్రీ, ఏడు, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 01-07-2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ఎస్‌వీ మెడికల్ కాలేజ్, తిరుపతి, చిత్తూరు జిల్లా అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 12, 000 నుంచి రూ. 52,000 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను రాత పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 15-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Petrol Diesel Price: ఢిల్లీలో తగ్గిన పెట్రోల్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..