AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే ఐదేళ్లలో టైర్ 2, 3 నగరాల్లో PwC ఇండియా కొలువుల జాతర.. ఏకంగా 20 వేల కొత్త ఉద్యోగాలొస్తున్నాయ్‌!

2030 నాటికి 20 వేల అదనపు ఉద్యోగాలను సృష్టించనున్నట్లు మంగళవారం (ఆగస్టు 12) ఓ ప్రకటనలో PwC ఇండియా తెలిపింది. ముఖ్యంగా టైర్-2 టైర్-3 నగరాల్లోకి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించనున్నట్లు PwC ఇండియా తన విజన్ 2030 ప్రకటనలో తెలిపింది..

వచ్చే ఐదేళ్లలో టైర్ 2, 3 నగరాల్లో PwC ఇండియా కొలువుల జాతర.. ఏకంగా 20 వేల కొత్త ఉద్యోగాలొస్తున్నాయ్‌!
PwC India
Srilakshmi C
|

Updated on: Aug 14, 2025 | 10:23 AM

Share

వచ్చే ఐదేళ్లలో దాదాపు మూడు రెట్లు ఆదాయ వృద్ధిని సాధిచాలని PwC ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 20 వేల అదనపు ఉద్యోగాలను సృష్టించనున్నట్లు మంగళవారం (ఆగస్టు 12) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు PwC ఇండియా తన విజన్ 2030ని విడుదల చేసింది. టైర్-2 టైర్-3 నగరాల్లోకి విస్తరించనున్నట్లు, డిజిటల్ పరివర్తన, స్థిరత్వం, రిస్క్, నియంత్రణ, క్లౌడ్ , సైబర్ భద్రత వంటి కీలక వ్యాపార రంగాలపై మరింత ఫోకస్‌ పెంచుతున్నట్లు తెలిపింది.

ఈ బిగ్ ఫోర్ సంస్థ ఏటా ఆదాయంలో 5 శాతం సాంకేతికత, ఆవిష్కరణ, సామర్థ్య నిర్మాణంలో భాగస్వాముల నైపుణ్యాలను పెంపొందించడానికి ఆదాయంలో 1 శాతం పెట్టుబడి పెడుతుంది. నేర్చుకునే అవకాశాన్ని విస్తరించడం, నాయకత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల అభివృద్ధికి వీలు కల్పించే సమ్మిళిత వృద్ధి ప్రయాణాలను సృష్టించడం ద్వారా క్యాంపస్ నుంచి బోర్డు రూమ్ వరకు భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండగలిగే శ్రామిక శక్తిని నిర్మించడంపై తాము దృష్టి సారించినట్లు PwC చైర్‌పర్సన్ సంజీవ్ క్రిషన్ అన్నారు.

PwC ప్రస్తుతం ఆరు ‘గో లాంగ్’ రంగాలలో విస్తరించింది. వీటిలో ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక తయారీ, ఆటో, టెక్నాలజీ, మీడియా, టెలికాం రంగాలు ఉన్నాయి. ఈ రంగాలు పరివర్తన ప్రభావానికి అతిపెద్ద అవకాశాలను అందిస్తుందని తెలిపారు. ఈ రంగాలలో తమ క్లయింట్ల భవిష్యత్తు విజయానికి వ్యాపార నమూనాలు, కార్యకలాపాలు, సాంకేతికత, వనరుల వినియోగం పునఃఆవిష్కరణ అవసరమని సంస్థ తన విజన్ 2030 ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగా తమ వ్యాపారాలను టైర్-2, టైర్-3 నగరాలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. డిజిటల్, సాంకేతిక సామర్థ్యాలను సైతం పెంచుతున్నట్లు క్రిషన్ అన్నారు. GenAI వంటి అత్యాధునిక సాంకేతికతలతో నడిచే PwC ఇండియా.. రాబోయే ఐదేళ్లలో కల్ కా భారత్ నిర్మించడానికి సహాయపడనుందని తెలిపారు. కాగా ప్రస్తుతం PwC దేవ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు 900 మంది భాగస్వాములు, 30 వేల మంది నిపుణుల బృందంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..