AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPCIL Recruitment: ఐటీఐ ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే.

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అటామిక్ పవర్ కార్పొరేషన్, కల్పక్కంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

NPCIL Recruitment: ఐటీఐ ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
Npcil Jobs
Narender Vaitla
|

Updated on: May 12, 2023 | 9:55 AM

Share

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అటామిక్ పవర్ కార్పొరేషన్, కల్పక్కంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 96 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* కార్పెంటర్‌, కంప్యూటర్ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌, డ్రాఫ్ట్‌ మెన్‌ (సివిల్‌), డ్రాఫ్ట్‌మెన్ (మెకానికల్‌), ఎలక్ట్రిషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెషిన్స్‌, ఫిట్టర్‌, ఇంస్ట్రుమెంట్‌ మెకానిక్‌, లాబరేటరీ అసిస్టెంట్‌, మెషినిస్ట్‌, ప్లంబర్‌, టర్నర్‌, వెల్డర్‌ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8వ తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 24 ఏళ్లకు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను మేనేజర్ (హెచ్ఆర్ఎం), హెచ్ఆర్ఎం విభాగం, ఎన్‌పీసీఐఎల్, మద్రాస్, అటామిక్ పవర్ స్టేషన్, కల్పక్కం, చెంగల్పట్టు జిల్లా, తమిళనాడు చిరునామాకు పంపాలి.

* అభ్యర్థులను అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ కాలం ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు మే 25ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..