UGC NET 2023: యూజీసీ నెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండిక్కడ

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2023 (యూజీసీ- నెట్‌) పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు జేఆర్‌ఎఫ్‌ కమ్‌ నెట్‌ అర్హతకు జూన్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు..

UGC NET 2023: యూజీసీ నెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండిక్కడ
UGC NET 2023
Follow us
Srilakshmi C

|

Updated on: May 11, 2023 | 8:42 PM

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2023 (యూజీసీ- నెట్‌) పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు జేఆర్‌ఎఫ్‌ కమ్‌ నెట్‌ అర్హతకు జూన్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు యూజీసీ వెల్లడించింది. అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ తదితర 83 సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ విధానంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పరీక్ష నిర్వహిస్తుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్‌కు జూన్‌ 1, 2023వ తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఆసక్తి కలిగిన వారు మే 31, 2023లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ అన్‌రిజర్వ్‌డ్‌కు రూ.1150; జనరల్- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ రూ.600; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్‌ కేటగిరీలు రూ.325 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. జూను 13 నుంచి జూన్‌ 22 వరకు యూజీసీ నెట్‌ 2023 పరీక్ష నిర్వహిస్తారు. కాగా ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 10, 2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2023.
  • పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: జూన్‌ 1, 2023.
  • దరఖాస్తు సవరణ తేదీలు: జూన్‌ 2, 3, 2023.
  • పరీక్ష తేదీలు: జూన్‌ 13 నుంచి 22 వరకు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.