AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DVC Recruitment: దామోదర్ వ్యాలీలో 92 ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.1,12,400ల జీతం

కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ పరిధిలోని పశ్చిమ్‌ బెంగాల్/ ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని వివిధ డీవీసీ ప్లాంట్లు/ స్టేషన్లలో.. ఒప్పంద ప్రాతిపదికన 40 జూనియర్ ఇంజినీర్ పోస్టులు, 52 అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన..

DVC Recruitment: దామోదర్ వ్యాలీలో 92 ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.1,12,400ల జీతం
DVC Kolkata
Srilakshmi C
|

Updated on: May 11, 2023 | 8:20 PM

Share

కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ పరిధిలోని పశ్చిమ్‌ బెంగాల్/ ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని వివిధ డీవీసీ ప్లాంట్లు/ స్టేషన్లలో.. ఒప్పంద ప్రాతిపదికన 40 జూనియర్ ఇంజినీర్ పోస్టులు, 52 అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెకానికల్, ఎలక్ట్రికల్, సి అండ్‌ ఐ, సివిల్, కమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు జూనియర్ ఇంజినీర్ పోస్టులకైతే కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు.. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 28, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ (అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూ) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..