NTPC Limited Jobs 2023: ఇంజనీరింగ్ నిరుద్యోగులకు జాబ్ ఆఫర్.. నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో 120 ఉద్యోగాలు..
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ).. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 120 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ).. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 120 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) పోస్టులు 100 వరకు ఉన్నాయి. అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్(ఎలక్ట్రికల్) పోస్టులు 20 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కనీసం రెండేళ్లపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో మే 23, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.