NIS Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధాలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. జీతభత్యాలు, ఇతర వివరాలు ఇవే..
భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా.. ప్రొఫెసర్, హాస్పిటల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా.. ప్రొఫెసర్, హాస్పిటల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, ఎంపిక విధానం, వయోపరిమితి వంటి ఇతర ముఖ్య వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా నోటిఫికేషన్ విడుదలైన 45 రోజుల్లోపు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. నోటిఫికేషన్ అక్టోబర్ 26వ తేదీన విడుదలైంది. దరఖాస్తు సమయంలో గ్రూప్ ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.750లు, గ్రూప్ సీ పోస్టుకలు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వారీగా జీతభత్యాల వివరాలు ఇలా..
- ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.37,400ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- హాస్పిటల్ సూపరింటెండెంట్ నెలకు రూ.15,600ల నుంచి రూ.39,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ నెలకు రూ.37,400ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- స్టెనోగ్రాఫర్ నెలకు రూ.5,200ల నుంచి రూ.20,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- లోయర్ డివిజన్ క్లర్క్ రూ.5,200ల నుంచి రూ.20,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ పోస్టుకలు జీతంతోపాటు ఇతర అలవెన్సులను కూడా చెల్లిస్తారు.
అడ్రస్: The Director, National Institute of Siddha, Tambaram Sanatorium, Chennai-600047.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.