AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2026 Last date: మరికొన్ని గంటల్లో ముగుస్తున్న జేఈఈ మెయిన్‌ 2026 రిజిస్ట్రేషన్లు.. దరఖాస్తులకు డైరెక్ట్ లింక్‌ ఇదే

NTA JEE Mains 2026 Session 1 Online Application last date: 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ జేఈఈ మెయిన్‌ 2026 తొలి విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మరికొన్ని గంటల్లో ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు గురువారం (నవంబర్‌ 27) రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో..

JEE Main 2026 Last date: మరికొన్ని గంటల్లో ముగుస్తున్న జేఈఈ మెయిన్‌ 2026 రిజిస్ట్రేషన్లు.. దరఖాస్తులకు డైరెక్ట్ లింక్‌ ఇదే
JEE Main 2026 Session 1 Online Registration
Srilakshmi C
|

Updated on: Nov 27, 2025 | 2:23 PM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 26: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ జేఈఈ మెయిన్‌ 2026 తొలి విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మరికొన్ని గంటల్లో ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు గురువారం (నవంబర్‌ 27) రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదేరోజు రాత్రి 11:50 గంటల్లోగా ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపలు చేసేందుకు అవకాశం ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ దరఖాస్తు సమయం పొడిగింపు ఉండబోదని, గడువులోగా అభ్యర్ధులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీయే ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు దొర్లితే డిసెంబర్‌ 1 నుంచి 2వ తేదీ రాత్రి 11.50 వరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెసులుబాటు కల్పించింది.

జేఈఈ మెయిన్‌ 2026 తొలి విడత రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

జేఈఈ మెయిన్ సెషన్ 1 దరఖాస్తు సమయంలో తప్పుగా నమోదుచేసిన వివరాల సవరణకు కేవలం ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. అందువల్ల అభ్యర్ధులు జాగ్రత్తగా తమ వివరాలు సరిచేసుకోవల్సి ఉంటుంది. ఇక జేఈఈ మెయిన్‌ 2026 తొలి విడత పరీక్షలు జనవరి 21 నుంచి 30వ తేదీ మధ్య దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లు జనవరి 2026 మొదటి వారంలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇక అడ్మిట్‌ కార్డులు జనవరి 2026 మూడో వారంలో విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్‌ 2026 తొలి విడత ఫలితాలు ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేస్తారు. ఈ మేరకు షెడ్యూల ప్రకారం అభ్యర్ధులు తమ సన్నద్ధతను కొనసాగించవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.