TET 2025 Hall Tickets: మరో వారంలో టెట్ 2025 హాల్ టికెట్లు విడుదల.. ఉచిత మాక్ టెస్ట్‌ల లింక్ ఇదే
Andhra Pradesh TET October 2025 Mock Test Link: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET October 2025)కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,58,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే బెదురుతూనే ప్రభుత్వ బడుల్లో సర్వీసులో ఉన్న టీచర్లు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో..

అమరావతి, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET October 2025)కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,58,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే బెదురుతూనే ప్రభుత్వ బడుల్లో సర్వీసులో ఉన్న టీచర్లు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సర్వీసులో కొనసాగాలంటే సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రెండేళ్లలోపు టెట్‌లో అర్హత సాధించవల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్న వారంతా.. టెట్ తప్పనిసరిగా పాసవ్వాలని, లేకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఇతర రాష్ట్రాలు సుప్రీంకోర్టులో రివ్వూ పిటీషన్ దాఖలు చేశాయి. ఇప్పుడు ప్రభుత్వ టీచర్ల ఆశలన్నీ ఈ పిటీషన్లపైనే నిలిచింది.
ఏపీ టెట్ 2025 అక్టోబర్ ఉచిత మాక్ టెస్ట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ముగించిన విద్యాశాఖ.. షెడ్యూల్ ప్రకారం కార్యచరణకు సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా మాక్ టెస్టులను పాఠశాల విద్యా శాఖ తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీ టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌లో మాక్ పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది. అభ్యర్థులు ఎలాంటి పాస్‌వర్డ్ లేకుండా సైన్-ఇన్ అవడం ద్వారా ఉచితంగానే మాక్ టెస్టులను ఉపయోగించుకోవచ్చు. ఇక డిసెంబర్ 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టెట్ ఆన్‌లైన్ రాత పరీక్షలు మొదలు కానున్నాయి. పరీక్షకు వారం ముందు అంటే డిసెంబర్ 3వ తేదీ నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 10 నుంచి టెట్ పరీక్షలు రోజుకు రెండు సెషన్‌లలో జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ప్రాథమిక కీ 2026 జనవరి 2న విడుదల చేస్తారు. ఇక ఫైనల్ కీ జనవరి 13న వెల్లడించి, తుది ఫలితాలు జనవరి 19న విడుదల చేయనున్నారు.
వచ్చే ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 16వేలకు పైగా పోస్టులు భర్తీచేసింది. అయితే ఇందులో మిగిలిన పోస్టులతోపాటు కొత్తగా ఏర్పడే ఖాళీలతో 2 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో టెట్‌కు మరోమారు నిరుద్యోగులు తమ వెయిటేజీ మార్కులు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఏపీ టెట్ 2025 అక్టోబర్ సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.



