వలలో చిక్కింది చూసి జాలరి సంబరం.. వేలంలో జాక్‌పాట్!
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరులకు అరుదైన చేప చిక్కింది. సుమారు 112 కిలోల బరువు, 3 మీటర్ల పొడవు ఉన్న ఈ చేపను మార్కెట్లో వేలం వేయగా దండిగా ధర పలికింది. ఈ సంఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా పాంబన్‌లో చోటు చేసుకుంది..

చెన్నై, నవంబర్ 18: సముద్రంలో వేటకు వెళ్లిన జాలరులకు అరుదైన చేప చిక్కింది. సుమారు 112 కిలోల బరువు, 3 మీటర్ల పొడవు ఉన్న ఈ చేపను మార్కెట్లో వేలం వేయగా దండిగా ధర పలికింది. ఈ సంఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా పాంబన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం ప్రాంతంలో కంట్రీ బోట్‌లో కొందరు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. వీరు రామేశ్వరం సమీపంలోని పంబన్ ఉత్తర తీరం నుంచి మత్స్యకారులు దక్షిణ సముద్రంలోని మన్నార్ గల్ఫ్‌కు కంట్రీ బోట్‌లో చేపల వేటకు వెళ్లారు. అయితే వారి వలకు అరుదైన భారీ చేప చిక్కింది. జాలర్లు మన్నార్ గల్ఫ్ వద్ద వేట సాగిస్తుండగా వలలో ఈ చేప చిక్కింది. టూనా అనే చేప ఇది. సాధారణంగా చూడటానికి భారీగా ఉండే ఈ చేప లోతైన సముద్రంలో మాత్రమే కనిపిస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ పసుపు రెక్కల టూనా చేప (ఎల్లోటెయిల్ ట్యూనా) సుమారు 112 కిలోల బరువు, 3 మీటర్ల పొడవు ఉంది.
రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం సమీపంలోని పంబన్ నార్త్ కోస్ట్ నుండి మత్స్యకారులు ఎప్పటిలాగే చేపలు పట్టడానికి ఒక కంట్రీ బోట్‌లో మన్నార్ గల్ఫ్ ప్రాంతానికి వెళ్లారు. మత్స్సకారులు ఆదివారం ఒడ్డుకు చేరుకోగా ఈ భారీ చేపను నలుగురు జాలర్లు తీరానికి మోసుకొచ్చారు. దీన్ని కేరళకు చెందిన ఓ వ్యాపారి రూ.17 వేలకు కొనుగోలు చేశారు. కాగా రామేశ్వరం సముద్రం స్టార్ ఫిష్, సముద్ర తాబేళ్లు, డాల్ఫిన్లు, తిమింగలాలు, సముద్రపు పాచి వంటి వివిధ రకాల అరుదైన సముద్ర జీవులకు నిలయం. దక్షిణ సముద్రాలలోని మన్నార్ గల్ఫ్‌లో కనిపించే అరుదైన చేపలు రామనాథపురం సముద్రంలో కూడా కనిపిస్తాయి.

ఎల్లోటెయిల్ ట్యూనా చాలా లోతైన సముద్ర ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుందని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. హిందూ మహాసముద్రంలో చాలా లోతైన ప్రాంతాలలో ఈ చేపలు కనిపిస్తాయి. ఇటువంటి భారీ చేపలు వలలలో చిక్కుకోవడం చాలా అరుదు అని వారు చెప్పారు. ఇక ఈ అరుదైన ఎల్లో టూనా చేపను చూడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో గుమి గూడారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




