వీడెవడండీ బాబూ.. కష్టపడటం ఎందుకనీ ఇంట్లోనే దుఖానం పెట్టేశాడు! కట్‌చేస్తే సీన్ సితార్..
Malegaon police seize fake currency notes worth over Rs 5 lakh: రెక్కలు ముక్కలు చేసుకుంటేగానీ నాలుగు పైసలు చేతిలో రాలవు. అలా సంపాదించిన సొమ్ము ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తుంటారు మధ్యతరగతి వ్యక్తులు. కానీ ఓ వ్యక్తి ఉన్నపలంగా ధనవంతుడైపోయి, విలాసంగా జీవించాలని ఆశ పడ్డాడు. అందుకు ఓ స్కెచ్ కూడా వేశాడు. ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న అతగాడు.. ఇంట్లోనే ఓ సెటప్ పెట్టేసి..

భోపాల్, నవంబర్ 18: రెక్కలు ముక్కలు చేసుకుంటేగానీ నాలుగు పైసలు చేతిలో రాలవు. అలా సంపాదించిన సొమ్ము ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తుంటారు మధ్యతరగతి వ్యక్తులు. కానీ ఓ వ్యక్తి ఉన్నపలంగా ధనవంతుడైపోయి, విలాసంగా జీవించాలని ఆశ పడ్డాడు. అందుకు ఓ స్కెచ్ కూడా వేశాడు. ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న అతగాడు.. ఇంట్లోనే ఓ సెటప్ పెట్టేసి.. ఏకంగా డబ్బు నోట్లను ముద్రించేశాడు. ఆనక వాటిని ఖర్చు పెట్టేందుకు యత్నించి పీకల్లోతు చిక్కుల్లో పడిపోయాడు. దీంతో ధనవంతుడవ్వాలనే అతడి కోరిక తీరకపోగా.. జైల్లో కూర్చుని ఊచలు లెక్కపెట్టాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే..
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని నిజాముద్దీన్ ప్రాంతంలో నవంబర్ 14న ఓ వ్యక్తి నకిలీ రూ.500 నోట్లతో తిరుగుతున్నాడు. వాటిని చలామణి చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద చూసేందుకు అచ్చం నిజమైన కరెన్సీ నోట్ల మాదిరి ఉన్న 23 నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆనక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు సంగతి కక్కెశాడు. నిందితుడిని భోపాల్‌లోని కరోండ్ ప్రాంతానికి చెందిన వివేక్ యాదవ్‌గా గుర్తించారు. ఇతడు ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నాడ. పోలీసులు అతడి మొబైల్ ఫోన్ పరిశీలించగా అందులో నకిలీ కరెన్సీ నోట్లు ఎలా తయారు చేయాలనే వీడియోలు తెగ చూసేసిన్లు వెల్లడించారు.
దీంతో ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసిన అనుభవంతో ఇంట్లోనే దుఖానం పెట్టి.. నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు వివేక్ యాదవ్ ఇంట్లో సోదా చేయగా మొత్తం రూ. 2,25,500 విలువైన 428 నకిలీ రూ.500 నోట్లు లభించినట్లు వెల్లడించారు. నిందితుడి ఇంట్లో ఫేక్ కరెన్సీ నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్, ప్రింటర్, పంచ్ మెషిన్, నోట్ కటింగ్ డైస్, జిగురు, స్క్రీన్ ప్లేట్లు, కట్టర్లు, స్పెషల్ పేపర్, పెన్సిల్స్, స్టీల్ స్కేల్, లైట్ బాక్స్, డాట్ స్టెప్పింగ్ ఫాయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివేక్ ఇప్పటి వరకు మొత్తం రూ.6 లక్షల నకిలీ రూ.500 నోట్లను చలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




