Free Skill Training 2025: నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ.. ఇలా దరఖాస్తు చేసుకోండి
నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ)-విజయవాడ, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్-బెంగళూరు సంయుక్తంగా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందిచేందుకు ముందుకు వచ్చింది. 120 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఉచిత నైపుణ్య..

అమరావతి, నవంబర్ 24: నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ)-విజయవాడ, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్-బెంగళూరు సంయుక్తంగా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందిచేందుకు ముందుకు వచ్చింది. 120 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఈ సంస్థ డైరెక్టర్ సీహెచ్ శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబరులో తొలుత 60 మందికి శిక్షణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పదో తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 30 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఇతర సమాచారం కోసం 9398050255 ఫోన్ నంబరును సంప్రదించాలని సూచించారు.
విద్యార్దుల సరాసరి మార్కులతోనే టీచర్ పనితీరు మదింపు చేయాలి: ఏపీ విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాసరి మార్కులతోనే టీచర్ పనితీరు మదింపు చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. తరగతి సరాసరి మార్కులనే ఉపాధ్యాయుడి పనితీరుగా పరిగణించాలని ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన చోట అకడమిక్ ఫోరంల ద్వారా మద్దతు ఇస్తామని వెల్లడించింది. ఉపాధ్యాయుల అవార్డులకు సైతం తరగతి సరాసరి మార్కులనే ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది.
వంద రోజుల కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని పదో తరగతి విద్యార్థుల సిలబస్‌ను డిసెంబరు 5వ తేదీ లోపు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరిలోపు సిలబస్ పూర్తిచేసి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పరీక్షల అనంతరం తొమ్మిదో తరగతి విద్యార్ధులకు మార్చి, ఏప్రిల్ నెలల్లో పదో తరగతి పాఠాలు బోధించాలని పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








