Hyderabad ISRO NRSC Jobs 2025: హైదరాబాద్ ఇస్రో NRSCలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎవరు అర్హులంటే?
Hyderabad ISRO NRSC Recruitment 2025 notification: హైదరాబాద్‌లోని ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ISRO NRSC )లోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు..

హైదరాబాద్‌లోని ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ISRO NRSC )లోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద 13 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) పోస్టుల సంఖ్య: 1 టెక్నికల్ అసిస్టెంట్ (ఆటోమొబైల్) పోస్టుల సంఖ్య: 1 టెక్నీషియన్ బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టుల సంఖ్య: 5 టెక్నీషియన్ బి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టుల సంఖ్య: 4 టెక్నీషియన్ బి (ఎలక్ట్రికల్) పోస్టుల సంఖ్య: 1 టెక్నీషియన్ బి (సివిల్) పోస్టుల సంఖ్య: 1
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో కనీసం 75 శాతం మార్కులతో ఐటీఐ, ఎన్‌టీసీ, ఎన్‌ఏసీ, డిప్లొమా, బీటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత ఉద్యోగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి నవంబర్ 30, 2025 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.
పోస్టుల వారీగా నెలవారీ జీతాలు ఇలా..
- టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) పోస్టులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు
- టెక్నికల్ అసిస్టెంట్ (ఆటోమొబైల్) పోస్టులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు
- టెక్నీషియన్ బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు
- టెక్నీషియన్ బి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు
- టెక్నీషియన్ బి (ఎలక్ట్రికల్) పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు
- టెక్నీషియన్ బి (సివిల్) పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








