IBPS Clerk 2025 Exam Dates: ఐబీపీఎస్ క్లర్క్ రాత పరీక్షల తేదీలు ఇవే.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. క్లర్క్ 2025 (CSA XV) పోస్టులకు సంబంధించిన మొయిన్స్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులందరూ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను..

హైదరాబాద్, నవంబర్ 25: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. ఈ నెలలో క్లర్క్ 2025 (CSA XV) పోస్టులకు సంబంధించిన మొయిన్స్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులందరూ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 29, డిసెంబర్ 2వ తేదీల్లో ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ లేదా రోల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఐబీపీఎస్ మొత్తం 13,533 క్లర్క్ ఉద్యోగాల భర్తీ ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డుల 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నవంబర్ 27 నుంచి RRB రైల్వే గ్రూప్ డి రాత పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి రాత పరీక్షలు నవంబర్ 27వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. ఈమేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 27 నుంచి జనవరి 16 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 32,438 గ్రూప్ డి రైల్వే పోస్టులకు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
RRB రైల్వే గ్రూప్ డి హాల్ టికెట్ల 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.



