AP RGUKT 2nd Phase Counselling : ఆర్జీయూకేటీ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి.. ఆగస్టు 9న కౌన్సెలింగ్
ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో రెండో వెడత సీట్ల కేటాయిపంఉ పూర్తైంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలి పోయిన 753 సీట్ల భర్తీకి సంబంధించి రెండోవిడతలో సీట్లు పొందిన విద్యార్ధుల వివరాలను కన్వీనర్ అమరేంద్రకుమార్ విడుదల చేశారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలోని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో..
అమరావతి, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో రెండో వెడత సీట్ల కేటాయిపంఉ పూర్తైంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలి పోయిన 753 సీట్ల భర్తీకి సంబంధించి రెండోవిడతలో సీట్లు పొందిన విద్యార్ధుల వివరాలను కన్వీనర్ అమరేంద్రకుమార్ విడుదల చేశారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలోని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన సీట్ల వివరాలను వెల్లడించారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో 180, నూజివీడులో 155, ఒంగోలులో 244, శ్రీకాకుళంలో 174 సీట్లకు సంబంధించి ఎంపిక జాబితాను ఆయన విడుదల చేశారు.
ఇడుపులపాయలో, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆగస్టు 9వ తేదీన నూజివీడులో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్‌సీసీ, క్రీడల కోటాకు సంబంధించి విద్యార్థుల జాబితా వచ్చే వారంలో విడుదల చేస్తామని తెలిపారు. ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 19, 20 తేదీల్లో ఆయా క్యాంపస్‌ల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నాలుగు క్యాంపస్‌లలో ఆగస్టు 21వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని కన్వినర్ తెలిపారు.
తెలంగాణ దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ గడువు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తు్న్న సంగతి తెలసిందే. దీని రిజిస్ట్రేషన్ గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి తెలిపారు. వెబ్ ఆప్షన్లను కూడా ఆగస్టు 5వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని, ఆగస్టు 7న సీట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ప్రత్యేక విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 9లోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే సీట్లు పొందిన కాలేజీల్లోనూ స్వయంగా రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు.