AP RGUKT 2024 Admission: ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. ఈ ఏడాది ఎన్ని సీట్లు ఉన్నాయంటే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ నాలుగు ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ రోజు (మే 8) నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖస్తు సమర్పణలకు అవకాశం ఉంటుంది. ఆర్‌జీయూ కేటీ పరిధిలో ఉన్న ఆర్‌కే వ్యాలీ క్యాంపస్, నూజివీడు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్, ఒంగోలు క్యాంపస్‌లలో..

AP RGUKT 2024 Admission: ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. ఈ ఏడాది ఎన్ని సీట్లు ఉన్నాయంటే
AP RGUKT 2024 Online Registration
Follow us

|

Updated on: May 08, 2024 | 3:01 PM

అమరావతి, మే 8: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ నాలుగు ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ రోజు (మే 8) నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖస్తు సమర్పణలకు అవకాశం ఉంటుంది. ఆర్‌జీయూ కేటీ పరిధిలో ఉన్న ఆర్‌కే వ్యాలీ క్యాంపస్, నూజివీడు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్, ఒంగోలు క్యాంపస్‌లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏపీ, తెలంగాణ విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే విద్యార్ధులు తప్పనిసరిగా 2024 సంవత్సరానికి పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి చొప్పున మొత్తం 4 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 85 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్ధులకు, మిగిలిన 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు కేటాయిస్తారు. వీటిల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 400 సీట్లు కేటాయిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.200, ఇతరులకు రూ.300 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్‌ నియమావళి ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందిన ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు మాత్రం అదనంగా 4 శాతం మార్కులు కలుపుతారు.

అలాగే రెండేళ్ల పీయూసీ చిదివాక, విద్యార్థులకు బయటకు వెళ్లేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తారు. మెరిట్‌ ఆధారంగా కేటగిరీ వైజ్‌ ప్రాధాన్య క్రమంలో క్యాంపస్‌లు కేటాయించడం జరుగుతుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు ఎంచుకున్న ప్రాధాన్యత వైజ్‌గా క్యాంపస్‌ కేటాయిస్తారు. ఒకసారి క్యాంపస్‌ నిర్ధారించిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ బదిలీకి అవకాశం ఉండదు. అందువల్ల ప్రవేశం పొందిన క్యాంపస్‌లోనే విద్యార్థులు చదవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
ఫరియా అబ్దుల్లా క్రేజీ ఫోటోస్ వైరల్..
ఫరియా అబ్దుల్లా క్రేజీ ఫోటోస్ వైరల్..
బరిలో నిలిచిన అభ్యర్థులు.. ఏ పార్టీలో ఎంత మంది కోటీశ్వరులు?
బరిలో నిలిచిన అభ్యర్థులు.. ఏ పార్టీలో ఎంత మంది కోటీశ్వరులు?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..