AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Polycet 2024 Results: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డు ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఏపీ పాలిసెట్‌-2024 ఫలితాలు బుధవారం (మే 8) విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి చేతుల మీదగా ఈ రోజు విజయవాడలో ఫలితాలు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలతో పాటు ర్యాంక్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 27న పాలిసెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 1.42 లక్షల మంది..

AP Polycet 2024 Results: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డు ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి
AP Polycet 2024 Results
Srilakshmi C
|

Updated on: May 08, 2024 | 2:51 PM

Share

అమరావతి, మే 8: ఏపీ పాలిసెట్‌-2024 ఫలితాలు బుధవారం (మే 8) విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి చేతుల మీదగా ఈ రోజు విజయవాడలో ఫలితాలు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలతో పాటు ర్యాంక్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 27న పాలిసెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 1.42 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ 2024 ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

వీరిలో 1.24 లక్షల మంది అర్హత సాధించారు. బాలికలు 50,710 (89.81 శాతం) మంది, బాలురు 73,720 (73.72 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది పాలీసెట్‌ ఫలితాల్లో 87.61 శాతం ఉత్తీర్ణత పొందినట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. పాలీసెట్‌ ర్యాంకులను ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్‌ కేటగిరి, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని కేటాయిస్తారు.

పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు మొత్తం 267 ఉన్నాయి. వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఫలితాలు వెల్లడించిన సాంకేతిక విద్యాశాఖ త్వరలోనే పాలిటెక్నిక్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేయనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన జూన్‌ 10వ తేదీ నుంచి పాలిటెక్నిక్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.