AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ISSO నేషనల్ గేమ్స్ చెస్ 2025 పోటీలు.. సత్తా చాటిన విద్యార్ధులు!

అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 6, 7 తేదీల్లో జరిగిన ISSO నేషనల్ గేమ్స్ చెస్ పోటీలు 2025 విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా పదికిపైగా రాష్ట్రాల నుంచి 80కి పైగా స్కూళ్లకు చెందిన 370 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, కోచ్‌లతో సహా మొత్తం 650 మందికి పైగా..

అదానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ISSO నేషనల్ గేమ్స్ చెస్ 2025 పోటీలు.. సత్తా చాటిన విద్యార్ధులు!
ISSO National Games Chess Competition at Adani School
Srilakshmi C
|

Updated on: Sep 08, 2025 | 8:40 AM

Share

అహ్మదాబాద్, సెప్టెంబర్ 8: అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో రెండు రోజుల ISSO నేషనల్ గేమ్స్ చెస్ పోటీ 2025 విజయవంతంగా జరిగాయి. సెప్టెంబర్‌ 6, 7 తేదీల్లో జరిగిన ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా పదికిపైగా రాష్ట్రాల నుంచి 80కి పైగా స్కూళ్లకు చెందిన 370 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, కోచ్‌లతో సహా మొత్తం 650 మందికి పైగా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. గుజరాత్‌లోని శాంతిగ్రామ్‌లోని ఈ క్రీడాపోటీలను నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో అండర్ 11, అండర్ 14, అండర్ 17, అండర్ 19 అనే నాలుగు విభాగాల నుంచి చెస్‌ నిర్వహించారు. ఈ రెండు రోజులలో చెస్‌లో పాల్గొన్న విద్యార్ధులు తమ ఆటలో పదునైన వ్యూహం, నైపుణ్యం ప్రదర్శించారు. ఇక ఈ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవం అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రమోటర్ నమ్రతా అదానీ చేతుల మీదగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్దులను ఉద్దేశించి ప్రోత్సాహకరమైన ప్రసంగాన్ని అందించారు. అలాగే ఆమెతోపాటు గుజరాత్ రాష్ట్ర చెస్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ భవేష్ పటేల్, గ్రాండ్‌మాస్టర్ అంకిత్ రాజ్‌పారా కూడా విద్యార్ధులకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను అందించారు.

ఈ రెండు రోజుల టోర్నమెంట్‌ అనంతరం జరిగిన ముగింపు వేడుకలో.. నాలుగు విభాగాలలో గెలుపొందిన విద్యార్ధులకు పతకాలు ప్రదానం చేశారు. టోర్నమెంట్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ పతకాన్ని ముంబైలోని చత్రభుజ్ నర్సీ స్కూల్ గెలుచుకోగా.. హైదరాబాద్‌లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రన్నర్స్-అప్ టైటిల్‌ను సంపాదించింది. ఈ రెండు స్కూల్స్‌కు చెందిన విద్యార్ధులు నాలుగు విభాగాల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించాయి.

Isso National Games

ఇవి కూడా చదవండి

భారత్‌కి యువ చెస్‌ క్రీడాకారులను క్లాస్‌ రూం నుంచే అందించేలా..

భారత్‌ చెస్ ప్రపంచ వేదికపై విశేష గుర్తింపు కలిగి ఉంది. ఆర్ ప్రజ్ఞానంద, డి గుకేష్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ప్రపంచ పటంపై భారత్‌ అగ్రశ్రేణి చెస్ దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందేలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక దేశంలోని అభివృద్ధి చెందుతున్న పాఠశాల స్థాయి క్రీడా విధానంలో ఈ అంతర్జాతీయ సక్సెస్‌ విశేషమైంది. ఎందుకంటే.. అదానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగే ఇలాంటి టోర్నమెంట్‌లు యువ ఆటగాళ్లకు ఉన్నత స్థాయి పోటీలకు ముందుగానే సిద్ధం చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇటువంటి వేదికల ద్వారా ప్రతిభను పెంపొందించడం ద్వారా భారత్ ప్రపంచంలోనే ఉన్నత స్థాయి టోర్నమెంట్‌లలోకి ప్రవేశించే పైప్‌లైన్‌ను నిర్మిస్తుంది. దేశవ్యాప్తంగా క్లాస్‌ రూమ్‌లు, క్యాంపస్‌ల నుంచి తదుపరి తరం ఛాంపియన్లను తయారు చేసేలా ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం అదానీ ఇంటర్నేషనల్ స్కూలోని సమగ్ర విద్య పట్ల వారికున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ అథ్లెటిక్ ఎక్సలెన్స్ మేధో వృద్ధిని సైతం పెంపొందిస్తున్నారు. క్రీడా క్లబ్‌లు, నిపుణుల కోచింగ్, రెగ్యులర్ పోటీల ద్వారా ఇక్కడి క్రీడా సంస్కృతిలో విమర్శనాత్మక ఆలోచన, స్థితిస్థాపకత, నైతిక ప్రవర్తనను పెంపొందిస్తుంది.

Isso Chess Competition

ISSO Chess Competition

అత్యున్నత ప్రమాణాలతో అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్య..

అదానీ ఇంటర్నేషనల్ స్కూల్.. అత్యాధునిక సాంకేతికతతో కూడిన అనుభవపూర్వక బోధనా ప్రక్రియను అవలంభిస్తుంది. అలాగే ఇక్కడ చదివే విద్యార్థులు కీలకమైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, విద్యార్థులకు సమగ్ర విద్యను అందించడానికి, సామాజిక స్పృహ, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తుంది. ఇక ఈ స్కూల్‌లోని టీచింగ్‌ టీమ్‌ దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థల నుంచి ఎంపిక చేసుకున్నారు. విద్యార్ధులను జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించడానికి ఇక్కడ బాటలు వేస్తారు.

  • మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సదర్శించండి: www.adaniinternationalschool.org
  • ఇతర వివరాలకు ఈమెయిల్‌ roy.paul@adani.com ద్వారా కూడా సంప్రదించవచ్చు

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.