Gold, Silver: కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి అమ్ముతోంది..? కొనుగోలు చేయడం ఎలా..?

బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అలాంటిది బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. పెళ్లిళ్లు, ఇతర పండగ సీజన్‌లో అయితే బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. బంగారాన్ని సురక్షితమైన స్వర్గంగా భావించే దేశం అనేక శతాబ్దాల నాటి లోహం పట్ల దీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉంది. బంగారం..

Gold, Silver: కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి అమ్ముతోంది..? కొనుగోలు చేయడం ఎలా..?
Gold And Silver
Follow us
Subhash Goud

|

Updated on: Apr 23, 2023 | 4:12 PM

బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అలాంటిది బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. పెళ్లిళ్లు, ఇతర పండగ సీజన్‌లో అయితే బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. బంగారాన్ని సురక్షితమైన స్వర్గంగా భావించే దేశం అనేక శతాబ్దాల నాటి లోహం పట్ల దీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉంది. బంగారం, వెండి లోహాల కొనుగోలును సులభతరం చేయడానికి, భారత ప్రభుత్వం ఒక ఆప్షన్‌ను రూపొందించింది.

ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయాలంటే షాపుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా బంగారాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ప్రజలు ఇప్పుడు నేరుగా భారత ప్రభుత్వ మింట్ నుంచి బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చు. 2.5 గ్రాములు, 5 గ్రాములు, 8 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు మొదలైన వివిధ విలువలను కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి గల కస్టమర్‌లు ఈ నాణేల కోసం ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్‌లు చేయవచ్చు. అలాగ భారతదేశంలోని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, నోయిడా, కోల్‌కతాలోని ఐదు ప్రదేశాలలో ఉన్న మింట్ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

భారతీయ ప్రభుత్వ మింట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి వినియోగదారులు బంగారం లేదా వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చు. భారత ప్రభుత్వ మింట్ ప్రకారం.. డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నగదు వంటి సదుపాయాల ద్వారా చెల్లింపులు చేసి కొనుగోలు చేయవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ మింట్‌లో ముద్రించిన, భారతదేశంలో విక్రయించబడే నాణేలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ ప్రకారం ధృవీకరించబడ్డాయి. నాణేలు 24-క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛంగా ఉంటాయి. బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తుంది. బంగారంపై పెట్టిన పెట్టుబడి స్థిరంగా ఉంటుంది.

మింట్‌ అంటే ఎమిటి?

మింట్‌ అంటే కొందరికి తెలిసినా మరి కొందరికి తెలియకపోవచ్చు. దేశంలో డబ్బులను తయారు చేసే కేంద్రాలను మింట్‌ కేంద్రాలు అని పిలుస‍్తారు. ఈ కేంద్రాలు దేశ వ్యాప్తంగా 5 మెట్రో నగరాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

1. ఢిల్లీలో జవహార్‌ వాయిపర్‌ భవన్‌ జన్‌పథ్‌

2. నోయిడాలో డీ-2 సెక్టార్‌ 1

3. హైదరాబాద్‌లో ఐడీఏ ఫేజ్‌ 2, చర్లపల్లి

4. ముంబైలో షాహిద్‌ భగత్‌సింగ్‌ రోడ్‌

5. కోల్‌కతాలోని అలిపోరి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి