Muhurat Trading: మురిపించిన దీపావళి ముహూర్త్ ట్రేడింగ్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Share Market Muhurat Trading: ముహూర్త్ ట్రేడింగ్ మురిపించింది. ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. గంటపాటు నిర్వహించిన ఈ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 24,300 పాయింట్లపైన ముగిసింది.

Muhurat Trading: మురిపించిన దీపావళి ముహూర్త్ ట్రేడింగ్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Muhurat Trading
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 01, 2024 | 8:45 PM

Share Market Muhurat Trading: ఇన్వెస్టర్లు ఎంతో సెంటిమెంట్‌గా భావించే ముహూర్త్ ట్రేడింగ్ లాభాల్లో ముగిసింది. దీంతో రెండు రోజుల సూచీల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. కొత్త సంవత్ లాభాలతో మొదలైంది. మార్కెట్లకు కొత్త ఏడాదిగా భావించే దీపావళి రోజు జరిగే ముహూర్త్ ట్రేడింగ్‌లో పాల్గొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుంటారు. గంటపాటు నిర్వహించిన ఈ ముహూర్త్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 24,300 పాయింట్లపైన క్లోజ్ అయ్యింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ముహూర్త్ ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్‌ 635 పాయింట్ల లాభంతో దూసుకుపోయింది. అయితే ముహూర్త్ ట్రేడింగ్ ప్రారంభమైన కాసేటికి లాభాలు తగ్గాయి. చివరికి 335 పాయింట్ల లాభంతో 79,724.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 94.20 పాయింట్లు లాభపడి 24,300 పాయింట్లపైన క్లోజ్ అయ్యింది.

ముఖ్యంగా ఆటో మొబైల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఆటో కంపెనీలు నెలవారీ విక్రయ గణాంకాలను విడుదల చేసిన తర్వాత ఆటో స్టాక్‌లలో కొనుగోళ్లు కనిపించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా దాదాపు 3% లాభపడగా, టాటా మోటార్స్ 1% కంటే ఎక్కువ లాభపడింది. మారుతీ సుజుకీ దాదాపు 0.6% లాభపడింది.

హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు కూడా లాభపడ్డాయి. ముహూర్త్ ట్రేడింగ్ ఎక్కువగా లాభాల్లోనే ముగుస్తుందన్న సెంటిమెంట్ ఈసారి కూడా కొనసాగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!