OnePlus 13 మొబైల్‌ వచ్చిందోచ్‌.. 100W ఛార్జర్‌తో సూపర్‌ ఫీచర్స్‌.. అదిరిపోయే కెమెరా!

Oneplus-13: వన్‌ ప్లస్‌ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్‌ వచ్చింది. కానీ ఇది భారత్‌లో ఇంకా విడుదల కాలేదు. చైనాలో మాత్రమే విడుదలైంది. త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది. కానీ అద్భుతమైన కెమెరా, ఫీచర్స్‌తో ఈ మొబైల్‌ను తీసుకువచ్చింది..

OnePlus 13 మొబైల్‌ వచ్చిందోచ్‌.. 100W ఛార్జర్‌తో సూపర్‌ ఫీచర్స్‌.. అదిరిపోయే కెమెరా!
Oneplus 13
Follow us

|

Updated on: Nov 01, 2024 | 5:55 PM

వన్‌ప్లస్‌ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ Oneplus 13 ను చైనాలో విడుదల చేసింది. కంపెనీ ఈసారి ఫోన్‌లో అనేక అప్‌గ్రేడ్‌లు, ఫీచర్లను తీసుకొచ్చింది. కొత్త క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే ప్యానెల్ కారణంగా, ఈ ఫోన్ చాలా ప్రీమియంగా కనిపిస్తోంది. ఈ ఫోన్‌లో Qualcomm సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, రీడిజైన్ చేసిన కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా కూడా విడుదల కానుంది.

చైనాలో OnePlus 13 ధర ఎంతంటే..

OnePlus 13 ధర OnePlus 12 కంటే కొంచెం ఎక్కువ. ఈ కొత్త ఫోన్ 12GB/256GB వేరియంట్ ధర RMB 4,499 (రూ.53,200). టాప్ వేరియంట్ 24GB/1TBని చైనాలో RMB 5,999 (రూ.70,900)కి కొనుగోలు చేయవచ్చు. అలాగే 12GB/512GBని RMB 4,899 (రూ.57,900)కి తీసుకొచ్చింది. 16GB/512GB వేరియంట్ చైనాలో RMB 5,299 (రూ. 62,600)కి అందుబాటులో ఉంటుంది. OnePlus 12 ప్రారంభ ధర RMB 4,299 (రూ. 50,700). తాజాగా విడుదల చేసిన ఫోన్‌లో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. త్వరలో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఈ సెటప్ ప్రధాన కెమెరాకు 50MP LYT808 సెన్సార్‌, సెకండ్‌ 50MP JN5 సెన్సార్, థర్డ్‌ పెరిస్కోప్ సెన్సార్. సెల్ఫీ కోసం ముందు భాగంలో 32MP కెమెరా అందించింది.

6000mAh జంబో బ్యాటరీ

ఈ మొబైల్‌లో 6000mAh జంబో బ్యాటరీని అందించింది. ఇది 100 వాట్ల వైర్డు, 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది IP68/IP69 రేటింగ్‌ను కూడా పొందుతుంది. ఇది ఫోన్‌ను నీరు, దుమ్ము సమస్యల నుండి పూర్తిగా సురక్షితంగా ఉంచగలదు. OnePlus 13 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

ఇది కూడా చదవండి: Vehicle Number Plates: వేర్వేరు రంగుల్లో నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయి..? అర్థం ఏంటో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి