Jan Dhan Yojana: రూ.1.5 లక్షల కోట్లు దాటిన జన్‌ధన్‌ ఖాతాల డిపాజిట్లు.. రూ. 2 లక్షల వరకు ప్రయోజనం..!

Jan Dhan Yojana:ఏడున్నరేళ్ల క్రితం ప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్‌ పథకం కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.1.5 లక్షల కోట్లు దాటింది. ఆర్థిక మంత్రిత్వ..

Jan Dhan Yojana: రూ.1.5 లక్షల కోట్లు దాటిన జన్‌ధన్‌ ఖాతాల డిపాజిట్లు.. రూ. 2 లక్షల వరకు ప్రయోజనం..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 09, 2022 | 3:48 PM

Jan Dhan Yojana:ఏడున్నరేళ్ల క్రితం ప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్‌ పథకం కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.1.5 లక్షల కోట్లు దాటింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ( PMJDY ) ఖాతాలకు డిసెంబర్ 2021 చివరి వరకు రూ 1,50,939.36 కోట్లు జమ అయినట్లు కేంద్రం తెలిపింది. ఆగస్టు 15, 2014న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో PMJDY ప్రణాళికను ప్రకటించారు. ఆర్థికంగా ప్రోత్సహించడానికి ఇది ఆగస్టు 28, 2014న ప్రారంభించబడింది. 44.23 కోట్ల ఖాతాల్లో ఈ డిపాజిట్‌ డబ్బులు జమ అయ్యాయి. ఈ ఖాతాల్లో 34.9 కోట్ల ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, 8.05 కోట్ల ఖాతాలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో, మిగిలిన 1.28 కోట్ల ఖాతాలు ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. అలాగే 31.28 కోట్ల మందికి రూపే డెబిట్ కార్డులను జారీ చేయబడ్డాయి. రూపే కార్డుల సంఖ్య, వాటి ఉపయోగం కాలక్రమేనా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది.

రూపే కార్డుతో రూ.2 లక్షల ప్రయోజనం: ఎస్‌బీఐ రూపే డెబిట్‌ కార్డు ఉపయోగించే అన్ని జన్‌ధన్‌ ఖాతాలకు రూ.2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజ్‌ అందిస్తోంది.2014లో ప్రారంభమైన ప్రధాన్‌ మంత్రి జన్‌ ధన్‌ యోజన పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ పథకం ద్వారా ఎస్బీఐ రూపే జన్ ధన్ కార్డును జన్ ధన్ ఖాతాదారులకు అందిస్తోంది. దీని ద్వారా ఈ కార్డు కలిగిన కస్టమర్లను రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ సౌకర్యం అందిస్తోంది. అయితే రూపే కార్డ్ మీ ఎటిఎం లాగా పనిచేస్తుంది. దీని సహయంతో మీ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. అలాగే షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు.

జన్ ధన్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి.. ఇప్పటివరకు మీరు జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయకపోతే.. మీ సమీప బ్యాంకుకు వెళ్లి.. జనధన్ ఫారం పూర్తి చేయాలి. అందులో మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామిని మొదలైనవి నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవైనా డౌట్స్ ఉంటే బ్యాంకు సిబ్బందికి అడిగినా చెబుతారు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సహ కేవైసీకి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి.ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

అలాగే ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఈ ఖాతా ఆన్‌లైన్‌లో కూడా ఓపెన్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ జన్‌ధన్‌ ఖాతాలపై జారీ చేసిన రూపే కార్డులకు ప్రమాద బీమా రూ. 2 లక్షల వరకు లభిస్తుంది. ఈ ప్రమాద బీమా పొందే సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించినట్లుతే క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని నామినీగా ఉన్న వ్యక్తికి అందించబడుతుంది.

క్లెయిమ్‌ చేయడానికి కావాల్సిన పత్రాలు 1) క్లెయిమ్ చేసుకునే పత్రంపై సంతకం 2) మరణ ధృవీకరణ ప్రతం 3) ప్రమాదం గురించి వివరణ ఇచ్చే పోలీసు స్టేషన్‌ యొక్క ఎఫ్‌ఐఆర్‌ కాపీ. 4) మరణం తర్వాత పోస్టుమార్టం నివేదిక పత్రం 5) కార్డుదారుని నామినీగా ఉన్న వ్యక్తి ఆధార్‌ కాపీ 6) జన్‌ధన్‌ కార్డు జారీ చేసిన బ్యాంకు నుంచి అధికారికంగా సంతకం చేసిన పత్రం. కస్టమర్‌కు జారీ చేసిన రూపే కార్డు నెంబర్‌ తప్పనిసరి. నామినీ పేరుపై ఉన్న బ్యాంకింగ్‌ వివరాలు. పత్రాలు సమర్పించిన తేదీ నుంచి పది పని దినాలలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రయోజనాలు మార్చి 31,2022 వరకు బెనిఫిట్స్‌ అందుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Fixed Deposit Interest Rate: పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్-ఎస్బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పోల్చితే..!

CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉండి రుణం పొందడం ఎలా..? స్కోర్‌కు లోన్‌కు సంబంధం ఏమిటి..?