మీరు జీతం తీసుకునే వ్యక్తులైతే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేదంటే అన్ని సమస్యలే..?

Financial Tips: మీరు జీతం తీసుకునే వ్యక్తి అయితే నెల ఖర్చుల కోసం కచ్చితంగా బడ్జెట్‌ వేసుకుంటారు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా పెద్ద మొత్తంలో

మీరు జీతం తీసుకునే వ్యక్తులైతే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేదంటే అన్ని సమస్యలే..?
DSCR
uppula Raju

|

Jan 09, 2022 | 3:38 PM

Financial Tips: మీరు జీతం తీసుకునే వ్యక్తి అయితే నెల ఖర్చుల కోసం కచ్చితంగా బడ్జెట్‌ వేసుకుంటారు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. అప్పుడు అప్పులు చేయవలసి వస్తుంది. ఇలాంటి అప్పులు భవిష్యత్‌లో ఇబ్బందులను కలిగిస్తాయి. మీరు ఏదైనా రుణం తీసుకున్నట్లయితే దానిని తిరిగి చెల్లించే బాధ్యత కచ్చితంగా మీపై ఉంటుంది. అయితే అప్పుల నుంచి సులువుగా బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకు ప్రత్యేక వ్యూహం అవసరం. అలాంటి కొన్ని పద్దతుల గురించి తెలుసుకుందాం.

1. వృధా ఖర్చు చేయకూడదు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా వ్యక్తిగత బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. ఆ బడ్జెట్‌లో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయకూడదు. వాటి కోసం కొంత డబ్బు ముందుగానే పక్కన పెట్టుకోవాలి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. భవిష్యత్‌లో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది.

2. చిన్న రుణ చెల్లింపులు రుణం సులువుగా తీసుకోవచ్చు కానీ చెల్లించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మీరు చాలా రుణాలు తీసుకున్నట్లయితే ముందుగా చిన్న రుణాలను చెల్లించడానికి ప్రయత్నించండి. నిజానికి పెద్ద అప్పును చెల్లించడానికి డబ్బు చాలా కావల్సి ఉంటుంది. కానీ చిన్న రుణాలకు అంత అవసరం ఉండదు. తొందరగా చెల్లించవచ్చు. దీంతో కొంత భారం తగ్గినట్లవుతుంది.

3. క్రెడిట్ కార్డు చెల్లింపులు నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ప్రజలకు అందుబాటులో ఉండడంతో జీతం రాకముందే చాలా మంది క్రెడిట్ కార్డుతోనే గడుపుతున్నారు. కానీ క్రెడిట్ కార్డ్ కూడా మీకు ఒక రకమైన రుణాన్ని అందిస్తుంది. దీనిని సమయానికి తిరిగి చెల్లించడం చాలా ముఖ్యం. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి, అప్పుల్లో కూరుకుపోకుండా ఉండటానికి మీ క్రెడిట్ కార్డ్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉపయోగించాలి.

4. రుణాలను చెల్లించడానికి బడ్జెట్‌ వేయండి.. మీరు ఒకటి కంటే ఎక్కువ రుణాలు తీసుకున్నట్లయితే ముందుగా ప్రత్యేక బడ్జెట్‌ను సిద్ధం చేసుకోండి. ఏదైనా ఒక నెలలో మీరు అదనపు డబ్బు పొందే అవకాశం ఉంటే కొంత రుణాన్ని చెల్లించండి. ముందుగా ఏ రుణాన్ని చెల్లించాలో మీరే నిర్ణయించుకోవాలి.

5. సమయానికి ముందే లోన్‌ చెల్లించండి.. లోన్‌ను డబ్బులు చెల్లించడానికి చివరి తేదీ కంటే ముందే మీ వద్ద డబ్బు ఉంటే వెంటనే చెల్లించండి. లేదంటే ఆ డబ్బు దేనికైనా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇలా చేయడం ద్వారా మీరు ముందస్తు బడ్జెట్‌ను కూడా సిద్ధం చేసుకోవచ్చు.

Jio: జియో మరో కొత్త వార్షిక ప్లాన్.. డైలీ 2.5GB డేటా అపరిమిత కాల్స్.. ధర ఎంతంటే..?

పాన్‌కార్డ్‌ దారులకు గమనిక..1000 రూపాయలు ఆదా చేసే అవకాశం..! ఎలాగంటే..?

JEE మెయిన్స్ పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి..? ఈ విషయాలు తెలుసుకుంటే విజయం మీదే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu