AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio: జియో మరో కొత్త వార్షిక ప్లాన్.. డైలీ 2.5GB డేటా అపరిమిత కాల్స్.. ధర ఎంతంటే..?

Jio: రిలయన్స్ జియో మరో కొత్త వార్షిక ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇది ఎక్కువ డేటా ఉపయోగించేవారికి అనువుగా ఉంటుంది. ఈ వార్షిక ప్లాన్‌ ధర రూ.2999.

Jio: జియో మరో కొత్త వార్షిక ప్లాన్.. డైలీ 2.5GB డేటా అపరిమిత కాల్స్.. ధర ఎంతంటే..?
Recharge Plan
uppula Raju
|

Updated on: Jan 09, 2022 | 3:05 PM

Share

Jio: రిలయన్స్ జియో మరో కొత్త వార్షిక ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇది ఎక్కువ డేటా ఉపయోగించేవారికి అనువుగా ఉంటుంది. ఈ వార్షిక ప్లాన్‌ ధర రూ.2999. ఇది 365 వాలిడిటీతో వస్తుంది. రోజుకు 2.5GB డేటాతో పాటు మరో 100 SMS/రోజును అందిస్తుంది. ఇది కాకుండా ప్లాన్ అదనపు ప్రయోజనాలలో JioMart, ఇతర Jio సేవలపై డిస్కౌంట్లను అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ “20% JioMart మహా క్యాష్‌బ్యాక్” ఆఫర్ కింద వెబ్‌సైట్‌లో జాబితా చేశారు.

కస్టమర్‌లు ఈ ప్లాన్‌ని ఎంచుకుంటే Jiomart నుంచి వస్తువులను కొనుగోలు చేయడంపై 20 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ క్యాష్‌బ్యాక్ Jiomart Walletకి క్రెడిట్ అవుతుంది. భవిష్యత్తులో కొనుగోళ్లకు దీనిని ఉపయోగించవచ్చు. డిస్కౌంట్ కాకుండా వినియోగదారులు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌తో సహా నాలుగు జియో అప్లికేషన్‌లకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తారు.

రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు జియో ప్రస్తుతం రెండు వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది. మొదటిది జియో సూపర్ వాల్యూ ప్లాన్ దీని ధర రూ. 2879. రెండోది ధర రూ.3119 ప్లాన్‌. రూ.2879 ప్లాన్ రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTV, JioCinema, JioSecurity, JioCloudతో సహా నాలుగు Jio అప్లికేషన్‌లకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMSలు కూడా ఉంటాయి.

రూ.3119 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా ప్రయోజనాలు, అపరిమిత కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTV, JioCinema, JioSecurity, JioCloudతో సహా నాలుగు Jio అప్లికేషన్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటాయి. ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMSలు కూడా వస్తాయి. అయితే, ఈ ప్లాన్‌లో 10GB అదనపు డేటా ప్రయోజన కూడా ఉంటుంది. కస్టమర్‌లు Disney+ Hotstarకి ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు.

Immunity Booster: మీకు జలుబు, జ్వరం ఉందా.. అయితే రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇలా చేయండి..

Cryptocurrency Prices: బిట్‌కాయిన్ ధరల్లో కొత్త ఆశలు.. ఎథెరియం పడుతూ లేస్తోంది..

Harish Rao: అమ్మా.. మాస్క్ మస్ట్.. ఇదిగో తీసుకో.. అలక్ష్యం వద్దన్న మంత్రి హరీష్ రావు..