JEE మెయిన్స్ పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి..? ఈ విషయాలు తెలుసుకుంటే విజయం మీదే..
JEE Mains Exam 2022:JEE పరీక్షకు సిద్దమవ్వాలంటే మంచి ప్రణాళిక ఉండాలి. సిలబస్ గురించి ఒక అంచనా ఉండాలి. అప్పుడే పరీక్షను సులువుగా క్లియర్ చేయవచ్చు. అయితే
JEE Mains Exam 2022:JEE పరీక్షకు సిద్దమవ్వాలంటే మంచి ప్రణాళిక ఉండాలి. సిలబస్ గురించి ఒక అంచనా ఉండాలి. అప్పుడే పరీక్షను సులువుగా క్లియర్ చేయవచ్చు. అయితే కొంతమంది సిలబస్‌ని చూసి భయపడుతారు. ఇంత పెద్ద సిలబస్‌ని ఎలా చదవాలని మదనపడుతారు. అలాంటి సమయంలో కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడే పరీక్షలో విజయం సాధిస్తారు. సిలబస్‌లో ముందుగా ఏం చదవాలో, ఏం చదవకూడదో తెలుసుకోవాలి. ఎందుకంటే పరీక్షలో విజయానికి స్టడీ ప్లాన్ కీలకం. ముఖ్యంగా JEE మెయిన్ అతిపెద్ద UG ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. JEE టాపర్లు, నిపుణుల ప్రకారం ప్రతి ఒక్కరికి సొంత పఠన విధానం ఉండాలి. దాని గురించి తెలుసుకుందాం.
JEE మెయిన్ 2022కి ఎలా సిద్ధం కావాలి ఏదైనా కోర్సు కోసం ప్రిపేర్ కావాలంటే ముందుగా సిలబస్‌ని బాగా అర్థం చేసుకోవాలి. ముందుగా మీ JEE మెయిన్ సిలబస్ 2022 గురించి తెలుసుకోండి. JEE పరీక్షా సరళిని అర్థం చేసుకోండి. ప్రిపరేషన్ ప్లాన్‌ను సిద్ధం చేయండి. ఆపై మంచి పుస్తకాలను ఎంచుకోండి. మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు మాక్ టెస్ట్‌లు, JEE మెయిన్ ఓల్డ్ పేపర్లను ప్రాక్టీస్ చేయండి. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే 11, 12వ తరగతికి చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో గట్టి పట్టు ఉండాలి. 11వ తరగతి, 12వ తరగతిలోని ప్రతి సబ్జెక్టులోని టాపిక్‌ను వేరు చేసి ఆపై చదవడం ప్రారంభించండి. రెండోది JEE మెయిన్ సిలబస్‌లోని అంశాలను సులభమైనవి, కష్టమైనవిగా విభజించండి. తద్వారా దానికనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించండి. కచ్చితంగా విజయం సాధిస్తారు.