ప్రతి వంటలో వాడే మిర్చి మన దేశానిది కాదు..! ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

ప్రతి వంటలో వాడే మిర్చి మన దేశానిది కాదు..! ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
Chilli

Chilli History: మిర్చిలేని వంటకాలను ఊహించుకోలేం. ప్రతి వంటకంలో ఇది ఉండాల్సిందే. అల్పాహారం నుంచి భోజనం వరకు అన్ని వంటకాలలో ఉపయోగిస్తారు. కానీ మిర్చిది

uppula Raju

|

Jan 08, 2022 | 7:36 PM

Chilli History: మిర్చిలేని వంటకాలను ఊహించుకోలేం. ప్రతి వంటకంలో ఇది ఉండాల్సిందే. అల్పాహారం నుంచి భోజనం వరకు అన్ని వంటకాలలో ఉపయోగిస్తారు. కానీ మిర్చిది భారతదేశంకాదు. ఇప్పుడు మిర్చి ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానంలో ఉంది వినియోగం కూడా ఎక్కువగానే ఉంది. కానీ మిరప భారతదేశంలోకి ఎలా వచ్చిందో తెలుసా.. దాని చరిత్ర, వాస్తవాల గురించి తెలుసుకుందాం.

మిర్చి చరిత్ర ఎపిక్ ఛానల్ డాక్యుమెంటరీలో చూపిన వాస్తవాల ప్రకారం.. మధ్య, దక్షిణ అమెరికా ప్రాంతంలో ప్రజలు 7000 BC నుంచి మిరపకాయను ఉపయోగిస్తున్నారని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. ఇది కాకుండా 6000 సంవత్సరాల క్రితం మెక్సికోలో మిరప సాగు ప్రారంభించారు. అంటే అప్పటికే చాలామంది మిర్చి తింటున్నారు పండిస్తున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మిరపకాయలు పండిస్తున్నారు దాదాపు 400 రకాల మిరపకాయలు ఉన్నాయి.

మిరపకాయ భారతదేశంలోకి ఎలా వచ్చింది? మిరపకాయను మొదట అమెరికాలో వాడారు. కానీ భారతదేశానికి 1498 సంవత్సరంలో వాస్కోడి గామా దానిని అమెరికా నుంచి ఇండియా తీసుకువచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ రుచి దేశం మొత్తం వ్యాపించింది. అయితే మిరపకాయ రాకముందు ఇండియాలో కారం కోసం వేటిని వాడేవారో తెలుసా.. నల్ల మిరియాలు వాడేవారు. ఒక్కసారి మిరప రుచి తెలిసాక అందరు దీనిని ఇష్టపడ్డారు. దీని కారణంగా నల్ల మిరియాల వాడకం తగ్గిపోయింది.

భారతదేశంలో మిర్చి ఉత్పత్తి ఎలా ఉంది? అమెరికా నుంచి మిర్చి ఇండియాకు వచ్చినా ఈ మిర్చిపై భారత్‌ పట్టు సంపాదించింది. ఇప్పుడు భారతదేశం మిర్చి ఉత్పత్తి పరంగా చాలా పెద్ద ఎగుమతిదారు. భారత్ నుంచి అమెరికా, నేపాల్, యూకే, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు మిర్చి పంపుతున్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం 1.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తుంది.1912లో అమెరికాకు చెందిన డబ్ల్యూ.ఎల్.స్కోవిల్లే మిరపకాయ ఎంత కారంగా ఉందో అంచనా వేయడానికి ఒక పద్ధతిని కనిపెట్టారు. అతను చక్కెర ద్వారా మిరపకాయ ఘాటును కొలవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు.

Viral Photos: ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన చెట్టు.. దీని పండు బాంబులా పేలుతోంది..

Corona: టీకాలు వేస్తున్నా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. కారణమేంటో తెలుసా..?

పిల్లల పేరుపై మ్యూచ్‌వల్‌ ఫండ్‌ ప్రారంభించండి.. 15 సంవత్సరాల తర్వాత 30 లక్షలు పొందండి..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu