Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: రూ.13.7 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉండదు.. జీరో ట్యాక్స్ ఫార్ములా గురించి మీకు తెలుసా?

Income Tax: ఈ ప్రయోజనం కొత్త పన్ను విధానంలో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే మీరు రూ.13.7 లక్షల వరకు ఆదాయంపై జీరో ట్యాక్స్ ఎలా చెల్లించవచ్చో తెలుసుకుందాం. గత బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారుల కోసం ఆర్థిక మంత్రి..

Income Tax: రూ.13.7 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉండదు.. జీరో ట్యాక్స్ ఫార్ములా గురించి మీకు తెలుసా?
Follow us
Subhash Goud

|

Updated on: Feb 03, 2025 | 6:17 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్నును జీరో చేసిన విషయం తెలిసిందే. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని కూడా కలిపితే, రూ. 12.75 లక్షల వరకు పన్ను బాధ్యత ఉండదు. అయితే రూ.12.75 లక్షలు వదిలేస్తే, ప్రైవేట్ ఉద్యోగులు మరో మార్గంలో రూ.95 వేల అదనపు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు రూ.13.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ప్రయోజనం కొత్త పన్ను విధానంలో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే మీరు రూ.13.7 లక్షల వరకు ఆదాయంపై జీరో ట్యాక్స్ ఎలా చెల్లించవచ్చో తెలుసుకుందాం.

ప్రయోజనం ఎలా పొందాలి:

గత బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారుల కోసం ఆర్థిక మంత్రి ఎన్‌పిఎస్ (NPS -National Pension System) ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించారు. దీని కింద సెక్షన్ 80 CCD (2) కింద NPS లో సహకారాన్ని 10 శాతానికి బదులుగా 14 శాతానికి పెంచవచ్చు. అంటే, ఒక వ్యక్తి జీతం రూ. 13.7 లక్షలు, అతని ప్రాథమిక వేతనం 50 శాతం ఆధారంగా సంవత్సరానికి రూ. 6.85 లక్షలు అయితే, అతను 14 శాతం ఆధారంగా ఎన్‌పిఎస్ రూపంలో రూ.95,900 పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా చేస్తే అతని మొత్తం పన్ను విధించదగిన ఆదాయం రూ. 11.99 లక్షలు అవుతుంది. అంటే రూ.12 లక్షల లోపు. దీని ఆధారంగా కొత్త ప్రతిపాదన ప్రకారం పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయం రూ.12 లక్షల పరిధిలోకి వస్తుంది. అంటే అతను ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

వివరాలు మొత్తం (రూ.లలో)
మొత్తం జీతం 13,70,000
బేసిక్ శాలరీ (50%) 6,85,000
NPSకి సహకారం (14%) 95,900
మొత్తం పన్ను విధించే ఆదాయం 11,99,100 (12 లక్షల కంటే తక్కువ)
పన్ను ఎటువంటి పన్ను విధించబడదు

మీరు ఈ సదుపాయాన్ని ఎలా పొందుతారు?

అయితే ఉద్యోగి ఈ సదుపాయాన్ని నేరుగా పొందలేరు. అంటే తన కోరిక మేరకు ఎన్‌పిఎస్‌లో సహకారాన్ని 10 శాతం నుండి 14 శాతానికి పెంచలేడు. దీని కోసం యజమాని తన ఉద్యోగికి కాంట్రిబ్యూషన్‌ను 14 శాతం పెంచుకునే అవకాశాన్ని ఇవ్వాలి. యజమాని ఎంపికను ఇచ్చిన తర్వాత ఉద్యోగి దీన్ని చేయవచ్చు. అలాగే అతను రూ. 13.7 లక్షల వరకు ఆదాయంపై జీరో పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు.

జీవితకాల పింఛను:

లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఈ NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్) ప్రయోజనాలను పొందలేరు. ఈ పథకం సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు 2.2 మిలియన్ల మంది మాత్రమే ఇందులో చేరారు. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్లు సుదీర్ఘ లాక్-ఇన్ పీరియడ్, మెచ్యూరిటీ సమయంలో ఉపసంహరణపై పరిమితుల వల్ల నిరాశ చెందారు. కొన్ని పరిస్థితులు కాకుండా, పదవీ విరమణకు ముందు ఎన్‌పీఎస్‌ నుండి డబ్బును ఉపసంహరించుకోలేరు. మెచ్యూరిటీ సమయంలో మొత్తంలో 60 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే 40 శాతం యాన్యుటీలో పెట్టుబడి పెట్టాలి. ఇది జీవితకాల పెన్షన్‌ను అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక్కడ భారీగా బంగారం నిల్వలు.. బకెట్ల కొద్ది ఇంటికి..
ఇక్కడ భారీగా బంగారం నిల్వలు.. బకెట్ల కొద్ది ఇంటికి..
పచ్చి మిరపకాయలతో క్యాన్సర్ పరార్.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా?
పచ్చి మిరపకాయలతో క్యాన్సర్ పరార్.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా?
ఆ రోజు ధోని ఏం చేశాడో.. అసలు కథను చెప్పేసిన సర్ఫరాజ్
ఆ రోజు ధోని ఏం చేశాడో.. అసలు కథను చెప్పేసిన సర్ఫరాజ్
ఒక్క సినిమాతో హీరోలకు వెనక్కు నెట్టింట హీరోయిన్..
ఒక్క సినిమాతో హీరోలకు వెనక్కు నెట్టింట హీరోయిన్..
మీకూ కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం సమస్యలు ఉన్నాయా?
మీకూ కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం సమస్యలు ఉన్నాయా?
అయ్యబాబోయ్..నాగార్జున అసలు పేరు ఇది కాదా..షాకింగ్ సీక్రెట్ రివీల్
అయ్యబాబోయ్..నాగార్జున అసలు పేరు ఇది కాదా..షాకింగ్ సీక్రెట్ రివీల్
ఇంత సింపుల్ లుక్‌లో అంత అందంగా ఎలా ఉన్నావు భాను..క్యూట్ ఫొటోస్
ఇంత సింపుల్ లుక్‌లో అంత అందంగా ఎలా ఉన్నావు భాను..క్యూట్ ఫొటోస్
పాకిస్థాన్‌ దిగజారినా.. హుందాగా బదులిచ్చిన టీమిండియా!
పాకిస్థాన్‌ దిగజారినా.. హుందాగా బదులిచ్చిన టీమిండియా!
తల్లిగా నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..చివరకు
తల్లిగా నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..చివరకు
సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్
సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్