SBI Interest Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ శుభవార్త.. లోన్ తీసుకుంటే సూపర్ బెనిఫిట్
తమ కస్టమర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తెలిపింది. లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులన్నీ ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విధాప పరపతి సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ఏకంగా 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. గతంలో 5.50 శాతంగా ఉన్న రేటును 5.25 శాతానికి పరిమితం చేసింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు భారీగా తగ్గనున్నాయి. దీని వల్ల లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐ తగ్గనుండగా.. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల కొత్తగా లోన్ తీసుకునేవారికి కూడా లాభం జరగనుంది. ఆర్బీఐ డెసిషన్ తర్వాత బ్యాంకులన్నీ ఒక్కొక్కటిగా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించగా.. తాజాగా ఇండియాలోనే నెంబర్ వన్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ
ఆర్బీఐ నిర్ణయం ప్రకారం ఎస్‌బీఐ వడ్డీ రేట్లలో కొత విధించింది. బీపీఎల్ఆర్‌ను 14.65 శాతానికి పరిమితం చేయడంతో పాటు బేస్ రేటును 9.90 శాతానికి తగ్గించింది. ఇక క్రెడిట్ రిస్క్ ప్రీమియం, బ్యాంక్ స్ప్రెడ్ ఈబీఎల్‌ఆర్‌ను ఎస్‌బీఐ 8.10 శాతం నుండి 7.90 శాతానికి తగ్గించింది. ఇక లోన్లకు సంబంధించిన ఎంసీఎల్ఆర్ కూడా తగ్గించింది. రెండేళ్ల కాలవ్యవధి గల లోన్లపై 8.80 శాతం నుండి 8.7 శాతంకు తగ్గించగా.. ఇక మూడేళ్ల కాలపరిమితి గల లోన్లపై 8.85 శాతం నుండి 8.80 శాతానికి తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినోళ్లకు బ్యాడ్‌న్యూస్
లోన్లు తీసుకునేవారికి, ఈఎంఐ ఉన్నవారికి వడ్డీ రేటు తగ్గడం వల్ల ప్రయోజనం పొందనుండగా..ఫిక్స్ డ్ డిపాజిట్ కొత్తగా చేయాలనుకునేవారికి మాత్రం దీని వల్ల నష్టం జరగనుంది. రెండేళ్ల కాల వ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.45 శాతం నుంచి 6.40కి వడ్డీ తగ్గించింది. ఇక సీనియర్ సిటిజన్ల రెండేళ్ల కాలవ్యవధి రుణాలపై 6.95 నుంచి 6.90 శాతానికి తగ్గించింది.




