వారంలో నాలుగు రోజులు పని, మూడు రోజులు సెలవు! కొత్త పని విధానానికి గ్రీన్ సిగ్నల్?
కొత్త కార్మిక కోడ్ ప్రకారం, వారానికి 48 గంటల పని పరిమితితో, కంపెనీలు 12 గంటల షిఫ్టులను అమలు చేయవచ్చు. దీని ద్వారా ఉద్యోగులకు మూడు రోజుల సెలవులు లభిస్తాయి. కార్మిక మంత్రిత్వ శాఖ దీనికి సుముఖత వ్యక్తం చేసింది. ఇది ఉద్యోగులకు మెరుగైన పని-జీవిత సమతుల్యతను అందించే అవకాశం ఉంది.

ఇండియాలోని పెద్ద నగరాలు, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలో వారంలో ఐదు రోజుల పని విధానం ఉంది. ఇక్కడ శనివారం, ఆదివారం సెలవులు. ఈ విధానం ఐటీ కంపెనీలలో మాత్రమే కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా వర్తిస్తుంది. ఇప్పుడు గత కొన్ని రోజులుగా నాలుగు రోజుల పని, మూడు రోజుల విశ్రాంతి కోసం డిమాండ్ ఉంది. జపాన్, స్పెయిన్, జర్మనీ వంటి ప్రపంచంలోని కొన్ని దేశాలలో, కంపెనీలలో 4 రోజుల పని సంస్కృతి ప్రజాదరణ పొందింది. అక్కడ వారంలో మూడు రోజులు సెలవులు. ఈ కొత్త మార్పు అక్కడ కూడా మంచి ఫలితాలను చూపించింది. కార్యాలయ ఖర్చులలో తగ్గింపు, హెల్దీ వర్క్ ఇన్విరాన్‌మెంట్ ఉంది. అయితే ఉత్పత్తి కూడా అలాగే తగ్గింది. ఇండియాలో కొత్త లేబర్ కోడ్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలో కూడా నాలుగు రోజుల పని, మూడు రోజుల విశ్రాంతి విధానాన్ని అమలు చేయడం గురించి చర్చ జరుగుతోంది.
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డిసెంబర్ 12న తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ Xలో ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో మంత్రిత్వ శాఖ వారానికి నాలుగు రోజుల పని, మూడు రోజుల సెలవులకు తన సమ్మతిని ఇచ్చినట్లు కనిపించింది. కొత్త కార్మిక కోడ్‌లో మంత్రిత్వ శాఖ వారానికి గరిష్టంగా 48 గంటల పని పరిమితిని నిర్ణయించింది. దీనిని ఇప్పటికే ఒక విధానంగా ప్రకటించారు. దీనితో పాటు 4 రోజుల పని వారానికి సాధ్యమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాస్తవానికి దీని కోసం కొన్ని నిబంధనలు, షరతులను పాటించాల్సి ఉంటుంది. కొత్త సవరించిన కార్మిక కోడ్ నాలుగు రోజుల పనికి 12 గంటల పని పరిమితిని ఇచ్చింది. అందువల్ల మిగిలిన మూడు రోజుల సెలవులు వర్తిస్తాయి. దీని కోసం ఉద్యోగి ఒక రోజులో 12 గంటల షిఫ్ట్‌లో పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు దీనికి సిద్ధంగా ఉన్న సంస్థల్లో వారానికి నాలుగు రోజుల పని, మిగిలిన మూడు రోజుల సెలవుల విధానాన్ని అమలు చేయడానికి ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు ఉండవు.
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఉద్యోగులకు 12 గంటల షిఫ్టుల మధ్య విరామం ఇవ్వవలసి ఉంటుంది. అందువల్ల కార్మికులకు షిఫ్ట్ ప్రకారం విరామం ఇవ్వవలసి ఉంటుంది. నాలుగు రోజుల వారపు విధానాన్ని అమలు చేసి, ఉద్యోగులు ఓవర్ టైం పని చేస్తే జీతం పెరుగుతుందా అని మంత్రిత్వ శాఖను అడిగారు. వారంలో 48 రోజుల పని పరిమితి ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వారు అంతకంటే ఎక్కువ పని చేస్తే, ఉద్యోగులు రెట్టింపు ఓవర్ టైంకి అదరపు చెల్లింపులు అందుకుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




