AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతికి దీటుగా విజయవాడ రైల్వే స్టేషన్.. ఇదిగో బ్లూ ప్రింట్..!

అమరావతి రాజధానికి దీటుగా విజయవాడ రైల్వే స్టేషన్ ను పిపిపి మోడ్ లో అభివృద్ధి చేయడానికి రైల్వే శాఖ సంసిద్ధమైంది. ఇప్పటికే ప్రతిపాదనలపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ద్వారా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ 661.11 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది.

అమరావతికి దీటుగా విజయవాడ రైల్వే స్టేషన్.. ఇదిగో బ్లూ ప్రింట్..!
Vijayawada Railway Station
M Sivakumar
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 14, 2025 | 4:31 PM

Share

అమరావతి రాజధానికి దీటుగా విజయవాడ రైల్వే స్టేషన్ ను పిపిపి మోడ్ లో అభివృద్ధి చేయడానికి రైల్వే శాఖ సంసిద్ధమైంది. ఇప్పటికే ప్రతిపాదనలపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ద్వారా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ 661.11 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడంతో రైల్వే యంత్రాంగం ఈ ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టింది.

మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి తరహాలో అమరావతి రాజధానికి అతి సమీపంలోని విజయవాడ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రతిపాదనలు రూపొందించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి కావాల్సిన బ్లూ ప్రింట్ ను కూడా తయారు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో 83.367 చదరపు మీటర్లుగా నిర్ణయించుకోగా వ్యాపార లావాదేవీలకు, స్టాల్స్, హోటల్ లాంటివి దగ్గర నుంచి రైల్వే కోటర్స్, స్టేషన్ కార్యాలయం వరకు 81.948 చదరపు మీటర్లలో అభివృద్ధి చేయనున్నారు. బెజవాడ రైల్వే స్టేషన్ ను విజయవాడ నగరానికి ఆకర్షణీయంగా నిలిచే విధంగా తూర్పు, పడమర వైపు ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.

తూర్పు ముఖద్వారం వైపు పార్లమెంటు ముఖద్వారానికి ధీటుగా సూపర్ లుక్‌తో ఆకట్టుకునే విధంగా నమూనాలను ఇప్పటికే తయారు చేశారు. అలాగే పడమర వైపు వన్ టౌన్ ప్రాంతమంతా కూడా వ్యాపారాలకు ప్రసిద్ధి. ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్ లో సైతం వివిధ వ్యాపారులకు అనుకూలంగా ఉండే విధంగా భవనాలను నిర్మిస్తున్నారు. ఇందులో రెండు మూడు అంతస్తులు వ్యాపారులకు అనుకూలంగా నిర్మించడానికి రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ లో మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. అయితే పెరిగిన రైళ్లకు తోడు ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా పెరిగింది. దీంతో బడ్జెట్ను కూడా కేటాయించారు.

ఇదిలా ఉండగా రైల్వే స్టేషన్ కు తూర్పు వైపు బయట ఉన్న సిటీ బస్టాండ్, స్కూటర్ పార్కింగ్ దగ్గర నుంచి టవర్ క్లాక్ ప్రాంతమంతా కూడా ఈ అభివృద్ధిలో మార్పులు చోటుచేసుకుని ఉన్నాయి. ఈ ప్రాంతం దగ్గర్లో స్టేషన్ కు చెందిన 41.70 చదరపు మీటర్ల ప్రాంతంలో జి ప్లస్ టు భవనం నిర్మించనున్నారు. అలాగే పడమర వైపు జి ప్లస్ టు 6.647 చదరపు మీటర్ల పరిధిలో భవనాలను నిర్మించనున్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో రైల్వే అధికారులు చర్చలు జరిపారు. తూర్పు వైపు నిర్మించనున్న ముఖద్వారం కానీ జి ప్లస్ టు వంటి భవన నిర్మాణాలే కానీ అన్నిటికీ అనుకూలమైన ప్రదేశం ఉండగా పడమర వైపు గాంధీ హిల్ కొండ ప్రాంతంలోని 100 మీటర్ల మేర ఇప్పటికే రైల్వే వెస్ట్ బుకింగ్ కార్యాలయం, టీటీల విశ్రాంతి భవనంతో పాటు ఆర్పీఎఫ్ విశ్రాంతి భవనాలు నిర్మించి ఉన్నాయి. రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఇప్పటికే గాంధీ హెల్కొండ ప్రాంతంలో మరికొంత భాగం స్టేషన్ అభివృద్ధికి కేటాయించాలని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరిగినట్టు సమాచారం దీనికి ప్రభుత్వం సానుకూలం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..