ఒడియవ్వ.. బంటి.. ఆ గ్రామంలో తిష్టవేసిన ఎలుగుబంట్లు.. జనాలు జర భద్రం
అరణ్యాలలోని వన్యప్రాణులలో భారీగా భయంకరంగా ఉండే సాధు జంతువులలో ఎలుగు బంట్లు కూడా ఒకటి.. అవి సామాన్యంగా ఎవరికీ హానీ చేయవు. వాటికి కావలసిన ఆహారాన్ని చెట్లు చేమలలో సంపాదించుకుంటూ దొరికిన దుంపలను తింటూ ఉంటాయి. అయితే వీటితో ప్రమాదం లేదా అంటే ఉంది.. అవి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమీ చేయవు.. కాని వాటితో పాటు వాటి పిల్లలు ఉన్నా, గుంపుగా ఉన్నా ఎలుగు బంట్లు దాడిచేసే అవకాశం ఉంటుంది అందుకే లంకమలో ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వాటితో జర జాగ్రత్త అంటున్నారు.

కడుప జిల్లా బద్వేల్ ఫారెస్ట్ రేంజ్‌లో ఉన్న లంకమల అటవీ ప్రాంతంలో ఎలుగు బంట్ల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతుంది.. గతంలో ఈ ప్రాంతంలో సంచార జీవిగా ఉండే ఎలుగు బంట్లు ఇప్పుడు లంకమల అటనీ ప్రాంత పరిధిలో వాటి ఆవాసాలను ఏర్పరుచు కుంటున్నాయి. ఆ అభయారణ్యం పొడి ఆకురాల్చే మిస్రమ ముళ్ళ అడవులు.. లోతైన లోయలు, ఏటవాలు ప్రాంతాలను కలిగి ఉంటుంది. అందుకే ఇక్కడ ఎలుగుబంట్లు ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటున్నాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు
ఎలుగుబంట్లు ఇక్కడ ఆవాసాలను ఏర్పరుచుకోవడంతో పాటు సంతానోత్పత్తికి అనువైన ప్రాంతంగా దీనిని మలుచుకుంటున్నాయని .. అందుకే ఈ ప్రాంతంలో వాటి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 50 పైగా ఎలుగుబంట్లు లంకమల అటవీ ప్రాంతంలో ఉన్నాయని అంచనా వేశారు.. దీని వలన సిద్దవఠం, బద్వేల్, అట్లూరు మండలాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ మద్య కాలంలో ఎలుగుబంట్లు పలు గ్రామాలలోకి రావడం, చెట్లపైకెక్కి గంటలు తరబడి కూర్చొని జనాలను ఇబ్బంది పెట్టడం వంటివి చేశాయి. అయితే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్పంగి పెటేటలేదు. అయితే గుంపుగా వచ్చినప్పుడు మాత్రం వాటితో జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




